ఖమ్మం

వక్ఫ్ భూముల లీజును రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), జూన్ 13: బినామీల పేర్లతో లీజుకు తీసుకొని అనుభవిస్తున్న వక్ఫ్‌బోర్డు భూముల లీజును రద్దు చేయాలని తన్షియో ఇన్సాఫ్ కమిటీ అధ్యక్షుడు రెహ్మాన్, మోమిన్ కమిటీ అధ్యక్షుడు మదార్‌లు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ పోరాటాలతో రక్షించుకున్న వక్ఫ్‌బోర్డు భూములను అధికారులను దొడ్డిదారిన పట్టుకొని కొంతమంది వ్యక్తులు అక్రమ లీజులకు తీసుకొని అనుభవిస్తున్నారని ఆరోపించారు. వందగజాలు లీజుకు తీసుకొని వెయ్యిగజాలను స్వాదీనం చేసుకుంటాన్నారని, వారు చేస్తున్న అక్రమాలను గుర్తించి అక్రమ లీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్‌కె సైదా, మహ్మద్ యాకూబ్, ఎంఎ అలీమ్, ఎస్‌కె ఆజాద్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.