ఖమ్మం

గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 17: అడవి బిడ్డలకు అండగా ఉంటానన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అడవులను ధారాదత్తం చేస్తూ, గిరిజనుల హక్కులను కాలరాస్తుందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేకేళ్ళుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఆదివాసీ, గిరిజనులపై దాడులు జరపడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్న హక్కులను హరించివేస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కరవుతో అల్లాడుతున్న రైతాంగాన్ని పట్టించుకోని కెసిఆర్ బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి ఇతరులను తన పార్టీలో చేర్చుకుంటున్న కెసిఆర్‌కు గుణపాఠం తప్పదన్నారు. పార్టీ ఫిరాయింపు దారులపై కోర్టుకు వెళతామని, త్వరలో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గార్ల మండలంలోని బయ్యారాన్ని ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని, ఆప్రాంతంలో ఉక్కుకర్మాగారాన్ని నిర్మించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రధాని నరేంద్రమోడి విదేశీ పర్యటనలకే పరిమితమైయారని, తనతోనే దేశాభివృద్ది అంటూ గొప్పల చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీసుకున్న ప్రణాళికలతోనే భారతదేశాభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో నాయకులు కట్ల రంగారావు, మనోహర్‌నాయుడు, భూక్యా శివకుమార్‌నాయక్ పాల్గొన్నారు.