ఖమ్మం

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్‌ది కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూన్ 21: టిఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసిన వ్యక్తి అన్నారు. నాడు ఆయన రచించిన వ్యూహాలే నేటి రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, టిఆర్‌ఎస్ నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆర్జెసి కృష్ణ, కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి వేడుకలను ఖమ్మంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అధికారులు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, తెలంగాణ వాదులు జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన ఉద్యమానికి చేసిన కృషిని కొనియాడారు. జిల్లా సమాచారశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆ శాఖ ఏడి మహ్మద్ ముర్తుజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడాల్సిన ఆవశ్యకతను వివరించి, ఉద్యమాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టింది జయశంకర్ అన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిఆర్వోలు యాకుబ్ పాషా, శీలం శ్రీనివాసరావు, ఏవిఎస్‌ఆర్ సుదర్శన్, సీనియర్ అసిస్టెంట్ వల్లోజి శ్రీనివాసరావు, ప్రచార సహాయకులు వెంకటకృష్ణ, రమేష్, టైపిస్టు రమణ యాదవ్, సింగర శ్రీనివాసరావు, డ్రైవర్ నర్సయ్య, నాల్గవ తరగతి సిబ్బంది నారాయణరావు, శ్రీనివాసరావు, ప్రతాప్ పోతన్, మంగ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్లలో...
కొణిజర్ల: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన అమరజీవి ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు టిఆర్‌ఎస్ నాయకులు కొనియాడారు. మంగళవారం నేలకొండపల్లిలోని బివిఆర్ కాంప్లెక్స్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే తెలంగాణ తొలి ప్రాంతవాసి సినీ గేయ రచయిత స్వర్గీయ చందాల కేశవదాసుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెనె్నపూసల సీతారాములు, మండల మాజీ అధ్యక్షులు వేణు, టిఆర్‌ఎస్ నాయకులు లక్ష్మయ్య, శంకర్, శ్రీనివాసరావు, నరేష్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌతమబుద్ధ చక్రవర్తి సొసైటీ ఆధ్వర్యంలో బోదులబండ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్, స్వర్గీయ చందాల కేశవదాసు వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కన్వీనర్ ఖాసీం, గ్రామ ప్రముఖులు వెంకటేశ్వర్లు, లింగరాజు, వెంకటేశ్వరరావు, వెంకటనారాయణ, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాంసాగర్ రెండో దశ పనులకు
55.23ఎకరాల భూమి సేకరణ
* జెసి దివ్య
ఖానాపురం హవేలి, జూన్ 21: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండో దశ పనులకు గాను తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 160మంది రైతుల వద్ద 55.23ఎకరాల భూమిని సేకరించి నష్టపరిహారాన్ని అందించేందుకు ధరను నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెంలో 2ఎకరాల 13న్నర కుంటలు, తెట్టెలపాడులో 2ఎకరాల 15న్నర కుంటలు, సుబ్లేడ్‌లో 5ఎకరాల 15న్నర కుంటలు, ఖమ్మం రూరల్ మండలంలో ఆరేకోడులో 13.22కుంటలు, కాశిరాజుగూడెంలో 10.09కుంటలు, కూసుమంచి మండలంలో 15.47ఎకరాలు, నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురంలో ఐదు ఎకరాల 25న్నర కుంటలకు నష్టపరిహారాన్ని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమ భూమి మధ్యలో నుంచి కాల్వ వెళ్తుండటం వల్ల ఆ ప్రాంతంలో బ్రిడ్జి గాని, మోరీలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ఎక్కువ భూములు ఉన్నట్లయితే శ్రీరాంసాగర్ ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవటం జరుగుతుందన్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం రైతులు ఎత్తిపోతల పథకం సాగులు అవుతున్నాయన్నారు. రైతులంతా బ్యాంక్ ఖాతానెంబర్లను సక్రమంగా అందించాలన్నారు. పదిరోజుల్లో నష్ట పరిహారాన్ని అందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, భూసేకరణ డిప్యూటీ తహశీల్దార్ మీనన్, నాలుగు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.
21 కెఎంపి-29: బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

హెల్మెట్ తప్పని సరి
* సత్తుపల్లిలో పోలీసుల బైక్ ర్యాలీ, మానవహారం
సత్తుపల్లి, జూన్ 21 : ద్విచక్రవాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని సత్తుపల్లి సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని పోలీసులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ దరించాలని భైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా సత్తుపల్లి పోలీసు స్టేషన్ నుంచి పాతబస్టాండ్ సెంటర్ అక్కడ నుండి రింగ్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం రింగ్ సెంటర్‌లో మానవ హారం ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు.సందర్భంగా సీఐ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రోడ్డుప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం మూలంగా 50శాతం పైన మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఇకనైనా తప్పనిసరిగా హెల్మెట్ దరించి రోడ్డుప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు అవకావాలున్నాయన్నారు.జూలై 1నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు మొదటి సారి రూ. 100 జరిమానా, రెండోసారి రూ. 1000లు వరకు జరిమానా అమలు చేయబడుతుందన్నారు. జిల్లా ఎస్పీ అదేశాల ప్రకారం హెల్మెట్ నిబందన కఠినంగా అమలు చేయబడుతుందన్నారు.
హెల్మెట్లను ధరించండి
* ఏఎస్పీ సాయికృష్ణ
ఖానాపురం హవేలి, జూన్ 21: ప్రతి ఒక్కరు హెల్మట్లను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఏఎస్పీ సాయికృష్ణ అన్నారు. మంగళవారం నగర శివారు బొమ్మా ఇంజనీరింగ్ కళాశాలలో హెల్మట్లపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు అధికమయ్యే అనేక మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎంతో ఆశలు పెట్టుకుంటారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు ఉండాల్సిన అవసరం కూడా ఉంటుందన్నారు. పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కొంతమంది తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇస్తున్నారని, తల్లిదండ్రులపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు హెల్మట్లను ధరించాలని సూచించారు. సమావేశంలో కళాశాల చైర్మన్ బొమ్మా రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బొమ్మా సత్యప్రసాద్, కార్యదర్శి శ్రీ్ధర్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.