ఖమ్మం

ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూన్ 26: పాలేరు నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ రెండో దశ, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సేకరించిన భూమికి ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక టిటిడిసిలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లోని 153మంది రైతుల నుంచి 42.04 1/2ఎకరాల భూమిని ప్రభుత్వ నిర్ణయం మేరకు సేకరించి ధర చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీరాంసాగర్ రెండో దశ పనులకు తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణిలో 2.15ఎకరాలు 13మంది రైతుల నుంచి, జల్లేపల్లిలో 3.39ఎకరాలు 12మంది రైతుల నుంచి, హైదర్‌సాయిపేటలో 62మంది రైతుల నుంచి 8.33ఎకరాలు సేకరించామన్నారు. అదే విధంగా భక్తరామదాసు ప్రాజెక్ట్‌కు తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 6.05 1/2ఎకరాలు పది మంది రైతుల నుంచి, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ పనులకు కూసుమంచి మండలంలోని గట్టుసింగారంలో 3.05 3/4ఎకరాలు 18మంది రైతుల నుంచి, జుజ్జుల్‌రావుపేటలో 3.34 1/2ఎకరాలను 17మంది నుంచి, నేలకొండపల్లి మండల రాజేశ్వరపురంలో 1.15 1/2ఎకరాలు 11మంది నుంచి, ఖమ్మం రూరల్ మండలంలోని ఎంవి పాలెంలో 3.15ఎకరాలు 11మంది రైతుల నుంచి, ఆరెకోడలో 3.5ఎకరాలు 20మంది రైతుల నుంచి అంగీకార పత్రం తీసుకొని ధర నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, ఆయా మండలాల తహశీల్దార్లు, భూసేకరణ ఉప తహశీల్దార్ మీనన్ తదితరులు పాల్గొన్నారు.