ఖమ్మం

నేడో రేపో నామినేటెడ్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 26: ఖమ్మం జిల్లాలోని నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేటెడ్ పోస్టులకు అర్హులైన వారి పేర్లను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందించినట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేతలతో పాటు పార్టీ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆరోపణలు లేని వారికే పదవులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పదవులన్ని తుమ్మల కనుసన్నలో ఉన్న నేతలకే దక్కుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌తో పాటు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డుకు సీనియర్ నేతలను నియమించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం మార్కెట్ చైర్మన్‌గా గడిచిన ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుండాల కృష్ణ(ఆర్జెసి), వైస్ చైర్మన్‌గా ప్రముఖ వ్యాపారవేత్త తల్లాడ రమేష్‌లను నియమించనున్నట్లు పార్టీల వర్గాల ద్వారా తెలిసింది. అలాగే వైరా, మధిర, ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అక్కడ సీనియర్ నేతలను నియమించనున్నారు. మరో వైపు భద్రాచలం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ తాళ్ళూరి వెంకటేశ్వరరావులలో ఒకరిని నియమించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వద్దకు వీరి పేర్లను పంపించగా, ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా వీరిపై పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో చేయకపోవటంపై పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలను తగ్గించేందుకు మరో రెండు రోజుల్లోనే ఈ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 29వ తేదీ వరకు జిల్లాలోనే పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ లోపుగానే వీటికి సంబంధించిన ప్రకటన విడుదలకానున్నట్లు తెలిసింది.