ఖమ్మం

ఫీజుల దోపిడీని ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 27: ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయంటూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించి ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థుల మధ్య జరిగిన తోపులాటలతో విద్యార్థుల అరెస్టుకి దారితీసింది. విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అర్భన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తొలుత శ్రీశ్రీ విగ్రహం నుండి ప్రదర్శనగా మంత్రి ఇంటికి చేరుకొని అక్కడ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. విద్యార్థుల నుండి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడటం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నప్పటికీ పాలకులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఫీజులు భరించలేని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకర్షణమైన పేర్లు పెట్టి విద్యార్థి తల్లిదండ్రులను ఆకట్టుకున్న విద్యాసంస్థలు వారి నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు విద్యాసంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. అటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందన్నారు. గతంలో చేసిన ఆందోళనల్లో పక్షం రోజుల్లో అధిక ఫీజులను నియంత్రిస్తామని చెప్పిన అధికారులు మూడునెలలు గడిచినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థి లోకం ఏకమై ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ రాకేష్, నాయకులు పృధ్వీ, ఆజాద్, మణికంఠ, మధు, రామాచారి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.