ఖమ్మం

పూర్తిస్థాయికి చేరిన బేతుపల్లి నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, జూన్ 30 : సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి ప్రాజెక్ట్‌లోకి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీరుచేరి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో బేతుపల్లి చెరువు నుంచి వేంసూరు, సత్తుపల్లి మండలాలలకు చెందిన 49 చెరువులకు సాగునీరు అందించే కాలువలకు గురువారం ఉదయం సత్తుపల్లి ఇరిగేషన్ డిఈఈ శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేశారు.బేతుపల్లి ప్రాజెక్ట్ నీటి మట్టం 16 అడుగులకు చేరుకోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాలువకు నీటిని విడుదల చేశామని ఇరిగేష్ డిఈఈ శ్రీనివాసరెడ్డి వివరించారు.
వేంసూరు చెరువులకు నీటి విడుదల
వేంసూరు: మండల కేంద్రమైన వేంసూరులోని చెరువులకు బేతుపల్లి వరద నీటిని ఐబి అధికారులు గురువారం విడుదల చేశారు. మండలంలోని లింగపాలెం, చౌడవరం, వేంసూరులోని పచ్చగనే్నరుకుంట, పునుగుబాటు చెరువు, రాళ్లచెరువులు నిండి కళ కళలాడుతుండటంతో రైతులు, ప్రజాప్రతినిధులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రైతులు కాలువ వద్ద, చెరువువద్ద లాంఛనంగా కొబ్బరికాయలు కొట్టి కాలువలో పసుపు, కుంకుమలు చల్లారు. అదే విధంగా మహిళలు కూడా కాలువ పొడువునా పూలుజల్లి తమ ఆనందాన్నిపంచుకున్నారు. ఈకార్యక్రమంలో ఐ.బి.డి. శ్రీనివాసరెడ్డి, ఏ.ఈనరసింహారావు,వెంకటేశ్వరరావు, ఎం.పి.పి జగన్నాధం, సర్పంచ్. టి గోపాల కిష్ణ, టిఆర్‌ఎస్ మండల అద్యక్షులు.వి జగన్‌మోహన్‌రావు, బొంతు భాస్కరరావు, పాలానర్సారెడ్డి, మేడారమేష్, రాచూరి గంగరాజు, మోరంపూడి భాస్కరరావు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.
కల్లూరులో 98.8 మి.మి. వర్షపాతం
కల్లూరు: కల్లూరులో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం 98.8 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కురుస్తున్న వర్షాలతో మండలంలోని 15 చెరువులు, 80 కుంటల్లో ఒక మోస్తరుగా వరదనీరు చేరాయి. జూన్ నెల ఆఖరు నాటికి కల్లూరు మండలంలో వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం 125మి.మి వర్షపాతం నమోదు కావలసి ఉండగా అంచనాలకు మించి 336 మి.మిల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కురిసిన వర్షాలతో ఖరీఫ్‌లో రైతులు తమ వ్యవసాయ పనులను ప్రారంభించుకోవచ్చని అధికారులు తెలిపారు.