ఖమ్మం

ఆధునిక, సాంకేతిక పద్ధతులను అవలంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, జూలై 1: ఆధునిక, శాస్ర్తియ, సాంకేతిక పద్ధతులను రైతులు అవలంభించి పంట సాగుబడి చేయాలని ఆర్‌ఆర్‌ఎస్ వరంగల్ అసోసియేషన్ ఆఫ్ రీసర్చ్ డాక్టర్ రఘురామరెడ్డి వెల్లడించారు. శుక్రవారం నేలకొండపల్లిలోని శ్రీ వాసవీ భవన్‌లో భక్తరామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందు ప్రముఖుల చేత జ్యోతి ప్రజ్వలనను నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిధి రఘురామరెడ్డి మాట్లాడుతూ సాగర్ కాల్వ ద్వారా నీరు వచ్చే ఆగస్టు 15తర్వాత సరఫరా జరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్పటి వరకు తమ భూముల్లో పచ్చిరొట్ట ఎరువులను పెంచాలని తెలిపారు. కొత్త రకం వరి వంగడాలను సాగు చేయడం ద్వారా రైతులతో పంట దిగుబడి పెరుగుతుందన్నారు. అలాగే వరి పంటకు ఎటువంటి రోగాలు కూడా రావని వివరించారు. డిపిటి 5204 వరి వంగడాలు మంచి దిగుబడి ఇస్తుందని, రైతులు ఈ రకం వరి వంగడాలు సాగు చేయాలని తెలిపారు. రసాయన ఎరువుల వాడకాన్ని రైతులు తగ్గించాలని, పత్తికి వాడేఎరువులను భూమిలో కలిసే విధంగా చూసుకోవాలన్నారు. తెలిపారు. వైరా కృషి విజ్ఞాన్ కేంద్ర ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్‌కుమార్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏరోబిక్ పద్దతిలో వరిసాగు చేయడం వలన రైతులకు 12వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఈ పద్దతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప కార్య నిర్వాహణ అధికారి ఏ వెంకటేశ్వర్లు, సీనియర్ వ్యవసాయ శాస్తవ్రేత్త శివాని, కూసుమంచి మండల వ్యవసాయ అధికారి వాణి, పాలేరు నియోజకవర్గ ఉజ్యాయన అధికారి రమణ, మదుకాన్ షుగర్ ఆర్‌అండ్‌బి హెడ్ శ్రీ్ధర్, నారాయణరావు రైతులకు సూచనలిచ్చారు. ఈ సదస్సులో సొసైటీ అధ్యక్షుడు అర్వపల్లి రామారావు, శ్రీనివాసరావు, నారాయణరావు, హన్మంతరావు, జనార్థన్‌రావు, వీరబాబు, లెనిన్ పాల్గొన్నారు.