ఖమ్మం

ఉపాధి పైకం చెల్లింపుల్లో కారేపల్లి వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారేపల్లి, జూలై 1: ఉపాధి హామీ పైకం చెల్లింపుల్లో మండలం రాష్ట్రంలో వెనుక నుండి నాలుగవ స్థానంలో ఉందని, దానికి కారణమైన కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేసినట్లు స్థానిక ఎంపిడివో శాంతాదేవి తెలిపారు. మండలంలో ఉపాధి పనులు కల్పించటంలో ముందంజలో ఉన్నామన్నారు. గత 3రోజుల చెల్లింపుల్లోనే ఇబ్బందులు తలెత్తాయని, దానికి ప్రధాన కారణం మస్టర్లు కంప్యూటర్‌లో నమోదు చేయకపోవటంతో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు సకాలంలో చెల్లింపులు జరగలేదన్నారు. దీంతో ఉపాధి హామీ కూలీలు పలుమార్లు పైకం చెల్లించటం లేదని ఆందోళనలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనికంతకూ కారణమైన కంప్యూటర్ ఆపరేటర్ అని, పిడి ఆదేశాల ప్రకారం విధుల నుండి తప్పించినట్లు తెలిపారు.