ఖమ్మం

హైకోర్టు విభజనకు మేమెప్పుడూ సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 1: హైకోర్టు విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి సిద్ధంగానే ఉన్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు విభజన కోరుతూ మార్చి 2015లో కేంద్రానికి లేఖ రాసింది ఏపి ముఖ్యమంత్రే అని విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. రాష్ట్ర పునర్వీభజన తాను చెప్పినట్లుగానే జరిగిందని ప్రచారం చేసుకున్న కెసిఆర్ ప్రస్తుతం హైకోర్టు విభజన సమయంలో వింతగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే పలు లోపాలు చోటు చేసుకున్నాయని ఏపి ముఖ్యమంత్రి అప్పట్లోనే చెప్పారన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హైకోర్టు విభజనకు పూనుకోవాలన్నారు.
ఇదిలా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు పరిపాలన చేసుకునే అవకాశం ఏపి ప్రభుత్వానికి ఉన్నప్పటికీ తమ రాష్ట్రంలో పరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబునాయుడు ఆ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా హైకోర్టు విభజనపై చర్చించకుండా ఏపి ముఖ్యమంత్రిపై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేసేందుకు పూనుకుంటున్నారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, చిత్తారు సింహాద్రి, తోటకూరి శివయ్య, అడ్వకేట్ రామారావులు పాల్గొన్నారు.
సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాల తనిఖీ
సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలను మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డిలు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకొని ఆస్పత్రి అంతా కలియ తిరిగి భవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆస్పత్రి 1978లో నిర్మించారని, భవనం అంతా కురుస్తుందని మంత్రులకు వైద్యులు వివరించారు. సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నూతన భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని, ఇంజనీరింగ్ విభాగాలను పంపించి భవనాల ఆధునీకరించడమా లేదా నూతన భవన నిర్మాణం చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. వీరి వెంట ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్‌డిఓ వినయ్‌కృష్ణారెడ్డి, గురుకుల పాఠశాల ఓఎస్‌డి నయిమ్, నగరపంచాయితీ చైర్మన్ దొడ్డాకుల స్వాతి, టిర్‌ఎస్, టిడిపి కౌన్సిలర్లు పాల్గొన్నారు.