ఖమ్మం

నిలకడగా వరద గోదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 3: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.4అడుగులకు చేరుకుని ఆదివారం సాయంత్రం నాటికి నిలకడగా కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు, గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానంగా ఉపనదులు తాలిపేరు, ప్రాణహిత, ఇంద్రావతి సమీపంలోనూ విస్తారంగా వానలు తోడై శనివారం నాటికి నీటిమట్టం 20 అడుగులకు పెరిగింది. శనివారం అర్థరాత్రి దాటాక వేగం పెరిగి సుమారు గంటకు అడుగు చొప్పున నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరప్రాంత అధికారులను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. అదివారం మధ్యాహ్నం నాటికి 28.4 అడుగుల వద్దకు వరద నీటి మట్టం చేరుకుని నిలకడగా మారిందని భద్రాచలం కేంద్ర జలవనరుల సంఘం అధికారులు వెల్లడించారు. భద్రాచలం తహశీల్దార్ రామకృష్ణ స్నాన ఘట్టాల వద్దకు వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. కరకట్ట సమీపంలో ఇసుక బస్తాలను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. వారం రోజులుగా కురిసిన వర్షాల వల్లే వరద పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.