ఖమ్మం

రైతు బజార్‌లో రూ. 120కే కెజి కందిపప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (మామిళ్ళగూడెం), జూలై 5: నగరంలోని ఆర్డీవో కార్యాలయం పక్కన ఉన్న రైతుబజార్‌లో సివిల్‌సఫ్లై శాఖ ఆధ్వర్యంలో 120 రూపాయలకు కేజి కందిపప్పు స్టాల్‌ను మంగళవారం జెసి దివ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పప్పు దినుసులకు పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు 120 రూపాయలకే కేజి కంది పప్పును అందించేందుకు సివిల్‌సప్లయి శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులు తమ ఆధార్ కార్డును కేంద్రానికి తీసుకొచ్చి నమోదు చేసుకొని కందిపప్పును తీసుకెళ్ళాలని సూచించారు. అనంతరం రైతుబజార్‌లోని కూరగాయల విక్రయాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు అమ్మే డ్వాక్ర మహిళలు తమ గ్రూఫుల వివరాలను బోర్డుపై రాసి ఉంచాలన్నారు. వినియోగదారులపై భారం మోపే విధంగా ఎవరైన ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సరఫరా అధికారి ఉషారాణి, సత్యవాణి, ఏడిఎం వినోద్‌కుమార్, సునీల్‌రెడ్డి, రైతుబజార్ ఇవో శే్వత, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్య
ఏన్కూరు, జూలై 5: సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. జూలూరుపాడు మండలం కర్రివారిగూడెం గ్రామానికి చెందిన ముప్పపల్లి మోహన్‌బాబు (30)కు పదేళ్ల క్రితం ఏన్కూరు మండలం సిఎల్ పేట పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మరియమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మృతుడు మోహన్‌బాబు మద్యానికి బానిసై ఇంట్లో భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ గొడవల కారణంగా గతంలో కూడా ఇదే సెల్‌టవర్ ఎక్కి రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపధ్యంలో మంగళవారం బాగా తాగి భార్య దగ్గరకు వెళ్లాడు. అక్కడ భార్యతో గొడవపడి మళ్లీ ఏన్కూరు వచ్చి బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి తన చొక్కా చింపుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ సంజీవ్, ట్రైనీ ఎస్‌ఐ రాజేష్ వచ్చి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.