ఖమ్మం

నేటి నుంచి తెలంగాణాకు హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం రెండో విడత నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఉదయం 10గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టరేట్‌లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఇందుకు అన్ని జిల్లా అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమం యజ్ఞంలా కొనసాగనున్నది. ఈ నెల 11, 12వ తేదీల్లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, 13వ తేదీన చెరువులు, చెరువుల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. 14వ తేదీన మొక్కల సంరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. 15, 16వ తేదీల్లో గృహాల్లో పండ్ల మొక్కలు నాటటం, 17నుంచి 19వ తేదీ వరకు కాలనీలు, అంతర్గతం రహదారులు, కమ్యూనిటీ భవనాలు, 20నుంచి 23వ తేదీ వరకు అన్ని ప్రదేశాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు.
ఏర్పాట్లు పూర్తి - లోకేష్‌కుమార్, జిల్లా కలెక్టర్
రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ స్పష్టం చేశారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొక్కలను రవాణా చేసేందుకు ఒక అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.