ఖమ్మం

ఇంటింటికీ ఐదు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, జూలై 9: ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణను రక్షించినవారు అవుతారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రితుమ్మల నాగేశ్వరరావుఅన్నారు. శనివారం సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. తుమ్మలతో పాటు ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు ఉన్నారు. ముందుగా ఉదయం 9గంటలకు మండల పరిధిలోని గంగారం గ్రామంలోని స్టేట్ హైవే మీద జంక్షన్‌లో రింగ్‌సెంటర్ రింగ్ నిర్మాణానికి 9.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 2.7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాకలగూడెం హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి సిద్ధారం గ్రామం చేరుకొని ప్రభుత్వ పాఠశాలలో సిద్ధారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన 5వేల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచడంతో పాటు పర్యావరణను పరిరక్షించిన వారు అవుతారని అన్నారు. సిద్ధారం గ్రామాన్ని హరితహారం కార్యక్రమంలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి మోడల్ గ్రామంగా పేరు గడించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం - 2 ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో వేప, ఉసిరి, నిమ్మ, జామ, కొబ్బరి తదితర మొక్కలను నాటాలని కోరారు. ఉద్యానవన శాఖ ద్వారా మొక్కలను అందుబాటులో ఉంచామని చెప్పారు. తనవంతుగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తునానన్నారు. నిర్మించిన రోడ్లను పాడు చేయకుండా పది కాలాల పాటు ఉండేలా గ్రామస్థులే కాపాడుకోవాలన్నారు. డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు మాట్లాడుతూ మనిషి జీవితం చెట్టుతో ముడిపడి ఉందని పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషికి చెట్టు ఆసరాగా తోడుగా నిలుస్తుందన్నారు. కార్యక్రమం అనంతరం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో మొక్కలను నాటారు. తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమంలో సిద్ధారం సర్పంచ్ మోరంపూడి ప్రమీలారాణి, ప్రసాద్, సత్తుపల్లి నగరపంచాయితీ చైర్మన్ దొడ్డాకుల స్వాతి గోపాలరావు, పాకలగూడెం సర్పంచ్ మలిశెట్టి చెన్నారావు, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసి సభ్యులు పాల్గొన్నారు.
వేంసూరు కెనాల్‌ను పరిశీలించిన తుమ్మల, పొంగులేటి
సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి ప్రాజెక్టు నుంచి వేంసూరు మండలంలోని 49 చెరువులకు సాగునీరు అందించే వరదనీటి కాలువను రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పరిశీలించారు. సత్తుపల్లి చిన్న వంతెన వద్ద వేంసూరుకు తరలివెళుతున్న బేతుపల్లి జలాలను పరిశీలించి ఇరిగేషన్ డిఈ శ్రీనివాసరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.