ఖమ్మం

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిఎకరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలో పర్యటించిన ఆయన బొమ్మనపల్లి సమీపాన గల నల్లవాగుపై నాబార్డు పథకం నిధులతో 4కోట్ల 90లక్షల రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం నుండి ఎడమ, కుడికాలువల ద్వారా వచ్చేనీటిని దుర్వినియోగం కాకుండా ప్రతిఎకరాకు సాగునీరును సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులను పొందాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ బలసాని లక్ష్మినారాయణ, డిసిసిబి చైర్మన్ విజయబాబు, జడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపిపి భూక్య లక్ష్మి, జడ్పీటిసి లక్కినేని సురేందర్, గొల్లపల్లి సర్పంచ్ బానోత్ సాములునాయక్ పాల్గొన్నారు.