ఖమ్మం

శ్రీసరస్వతీ అమ్మవారి విగ్రహం ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి జూలై 10 : వాసవి కపుల్స్ క్లబ్, వాసవి క్లబ్ వనిత భక్తరామదాసు సంయుక్త ఆధ్వర్యంలో నేలకొండపల్లిలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో శ్రీ సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆ విద్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సరస్వతి అమ్మవారి విగ్రహంను వాసవీ క్లబ్ జిల్లా గవర్నర్ గంగిశెట్టి గంగాధర, జగదీష్‌కుమార్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అక్షరభ్యాసం చేసుకునేందుకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ కబ్ల్ డిప్యూటీ గవర్నర్ రేగూరి హనుమంతరావు, గ్రామ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, వాసవి రీజియన్ సెక్రటరీ దేవరశెట్టి సీతా, వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షడు దేవరశెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శి దోసపాటి శేఖర్, కోశాధికారి వంగవీటి పవన్‌కుమార్, వానిత క్లబ్, వనిత భక్తరామదాసు అధ్యక్షురాలు ఈగ కన్యాకుమారి, కార్యదర్శి కొత్తారాణి, కోశాధికారి అత్తులూరి నాగలక్ష్మీ, ఆర్యవైశ ప్రముఖులు కొత్తా జనార్థన్‌రావు, గెల్లా జగన్‌మెహన్‌రావు, యిగా అనిల్, గరిణే వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు నండూరి మాధవరావు, విద్యార్థులు పాల్గొన్నారు.