ఖమ్మం

28 లక్షలకు చేరిన ఖమ్మం జనాభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 10: ఖమ్మం జిల్లా చైతన్యానికి, ఉద్యమాలకు పురిటిగడ్డగా దేశ వ్యాప్తంగా పేరుంది. కాని ఆశించిన స్థాయిలో సౌకర్యాలను మాత్రం మెరుగుపరుచుకోలేకపోయింది. ఒకవైపు జనాభా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా వౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 41 మండలాలు, ఒక కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలు, 671 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాను 4 రెవెన్యూ డివిజన్లుగాను, 7 పోలీస్ సబ్‌డివిజన్లుగాను విభజించి పరిపాలన సాగిస్తున్నారు. రాష్ట్ర విభజనతో జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించబడ్డాయి. త్వరలోనే కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లా ఏర్పడనున్నది. ప్రస్తుతతం జిల్లా 13,266 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా జిల్లా విభజనతో సుమారు 4,500 చ.కిమి విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా, 8,700 చ.కిమి విస్తీర్ణంలో కొత్తగూడెం జిల్లా ఉండే అవకాశం ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా రేటు 3శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 27,97,370 మంది జనాభా ఉండగా అందులో 13,90,988 మంది పురుషులు, 14,06,382 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 1,008గా ఉండడం గమనార్హం. మొత్తం జనాభాలో 20శాతం పట్టణ జనాభా కావడం విశేషం. సుమారు ఆరున్నర లక్షల మంది ప్రజలు నగరాల్లో జీవిస్తున్నారు. మొత్తం జనాభాలో 70.89 శాతం అక్షరాస్యులుగా ఉండగా ఇందులో అర్బన్ ప్రాంతంలో 81.26, రూరల్‌లో 60.52 శాతం మంది చదువుకున్న వారు ఉన్నారు. అక్షరాస్యతను పెంచేందుకు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పథకాలతో వందల కోట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు.
కాగా జిల్లాలో 0-4 వయస్సు కలిగిన వారు 1,92,680, 5-14 మధ్య 5,12,872 మంది, 15-59 మధ్య 18,03,860 మంది, 60 సంవత్సరాలకు పైబడిన వారు 2,73,728 మంది జీవించి ఉన్నారు. కాగా ఇందులో 6,12,671 మంది వ్యవసాయ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. జిల్లా మొత్తం మీద 6,99,820 ఇళ్లు ఉండగా, ఇళ్లు లేనివారు దాదాపు 4వేల మంది ఉన్నారు. ఇందులో అర్బన్ ప్రాంతంలో 1,71,064 ఇళ్లు ఉండగా, రూరల్ ప్రాంతంలో 5,28,756 ఇళ్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఖమ్మం జిల్లాలో కూడా జనాభా పెరుగుతూనే ఉన్నది. ఇదే సమయంలో మహిళల పట్ల వివక్ష కూడా కొనసాగుతూనే ఉన్నట్లు అనేక సార్లు రుజువైంది. ప్రస్తుతం జిల్లాలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండడం, అన్ని వయస్సులోనూ మహిళల శాతమే ఎక్కువగా ఉండడం వివక్షను తెలియజేస్తుంది.
ప్రపంచ జనాభా దినోత్సవం సోమవారం జరగనుండగా జిల్లాలో కూడా జనాభా పరంగా ప్రజలను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మంలో ప్రదర్శనతో పాటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.