ఖమ్మం

అదుపులోకి వచ్చిన మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 12: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పివికె -5ఇంక్లైన్ గనిలో చెలరేగిన మంటలు మంగళవారం సాయంత్రంతో అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. శుక్రవారం సాయంత్రం నుండే పొగలు రావడాన్ని గమనించి కార్మికులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికి సత్వరమే స్పందించని ఫలితంగా ఈప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
మంటలు అదుపులోకి వచ్చిన తురువాత సీల్‌వాల్వ్‌లను నిర్మిస్తున్నారు
మంటలు అదుపులోకి వచ్చినప్పటికి బొగ్గునిప్పు కణికలు ఉండడం వలన బొగ్గు ఉత్పత్తి చేయడానికి మరో రెండురోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా గనిలో ఇంకా సీల్‌వాల్‌లకు ఏమైనా లీకేజీలు ఉన్నాయేమోనని రెస్క్యూటీం క్షుణంగా పరిశీలిస్తుంది. కొత్తగూడెంతో పాటు భూపాలపల్లి నుండి కూడా రెస్క్యూటీం వచ్చి నిర్వహించిన నిర్వీరామ కృషి ఫలితంగా మంటలు అదుపులోకి వచ్చాయి. డైరెక్టర్ (ఆపరేషన్స్) బిక్కి రమేష్‌కుమార్, జిఎం (సేఫ్టి) కరుణాకర్‌రెడ్డి, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ రమణమూర్తి నేతృత్వంలో యుద్దప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఇప్పటికి అధికారులు నోరువిప్పకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.