ఖమ్మం

టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది మోసపూరిత పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, జూలై 15: టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం పాలన చేస్తోందని మాజీమంత్రి డి శ్రీ్ధర్‌బాబు అన్నారు. శుక్రవారం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ ఉప్పల శివరాంప్రసాద్, సిబ్బంది ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజానంతరం అర్చకులు మహా మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందించారు. అనంతరం జమలాపురం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అయిలూరు సత్యనారాయణరెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మహస్తం పేరుతో ప్రతి పేదవానికి నిత్యం అవసరమైన తొమ్మిది రకాలైన వస్తువులను దాదాపు 80శాతం దారిద్య్రరేఖ కింద ఉన్న వారికి లాభం చేకూరే విధంగా అందించామన్నారు. ఈ రోజు అందులో ఒక్క బియ్యం తప్పితే సామాన్యులకి కావాల్సిన ఏ వస్తువు ప్రభుత్వం అందించడం లేదని ఆయన అన్నారు. సామాన్యులకు కావాల్సిన వస్తువులను ప్రభుత్వం రేషన్ దుఖాణాల ద్వారా అందించాలన్నారు. అలాగే హరితహారంలో మొక్కలు పెంచడం తప్పు కాదు, కానీ అందులో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గత సంవత్సరం హరితహారంలో సిఎం వేసిన మొక్కను కూడా బ్రతికించలేని ప్రభుత్వం ఇప్పుడు 40కోట్ల మొక్కలను వేసి ఎలా బ్రతికిస్తుందని ఆయన ప్రశ్నించారు. గిన్నీస్ బుక్‌లో ఎక్కడం కోసమే ఈ హరితహారం కార్యక్రమం చేపట్టారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన భూములను కూడా హరితహారం పేరుతో ప్రభుత్వం స్వాదీనం చేసుకునే విధంగా వారిని భయభ్రాంతులను చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మొక్కలు నాటనట్లు, మంచినీరు ప్రజలకు అందించనట్లు, ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు తీర్చనట్లు టిఆర్‌ఎస్ ప్రభుత్వం తామే తీరుస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నర్సింహరావు, అనుమోలు కృష్ణారావు, శీలం నర్సిరెడ్డి, కృష్ణారావు, వేమిరెడ్డి అంకిరెడ్డి, బాబు, శ్రీను పాల్గొన్నారు.