ఖమ్మం

జిల్లాలో 85 లక్షల మొక్కలు నాటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 18: జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద ఇప్పటి వరకు 85లక్షల మొక్కలు నాటినట్లు రాష్టమ్రంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్నలు తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలో ఒకేరోజు రెండులక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారు నగరంలో పలుచోట్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్ల వలన కలిగిన ప్రయోజనాలను గుర్తించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఎప్పుడైనా నర్సరీల నుంచి మొక్కలను తెచ్చుకొని నాటుకోవొచ్చని స్పష్టం చేశారు. వెలుగుమట్ల అటవీ భూముల్లో ఒక్కరోజులో 50వేల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. వెలుగుమట్లలో ఉన్న అటవీ భూములు 269 ఎకరాల్లో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూమిచుట్టూ కంచెతో పెన్షింగ్ వేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పర్యావరణంలో వస్తున్న మార్పుల్లో చెట్లు తక్గువగా ఉండటమే పెద్ద కారణమని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొంటున్నట్లు వివరించారు. ప్రజలు తమ ఇంటి ఆవరణలోనే అవసరమైన పండ్ల, పూల మొక్కలు వేసుకునేందుకు నర్సరీల నుంచి ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌తో పాటు స్థానికులు అడిగిన మొక్కలనే ఖమ్మం నగరంలో పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే అజయ్‌కుమార్, మేయర్ పాపాలాల్, కలెక్టర్ లోకేష్‌కుమార్, జెసి దివ్య తదితరులు పాల్గొన్నారు.