ఖమ్మం

కేరింతలతోహోలీ కేళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్): హోలీ హోలీల రంగ హోలీ ..చెమకేళిన హోలీ అంటూ నగరంలోవివిధ వర్గాలవారు, వయసులవారు కేరింతల మధ్య హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం ఉదయం నుండే యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరుకుని బంధువులకు, స్నేహితులకు, ఆప్తులకు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అధికారులు తమ పై అధికారుల ఇండ్లకు వెళ్ళి రంగులు అద్దడంతో అధికారులు సైతం వారితో కలిసి చిందులు వేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధానంగా నూతనంగా ఏర్పాటైన కార్పోరేషన్ పాలకమండలి మేయర్, డిప్యూటి మేయర్‌లతో పాటు కార్పోరేటర్లు తమ విజయోత్సవాన్ని హోళీ రూపంలో నిర్వహించుకోవడం విశేషం. స్థానిక 24వ డివిజన్‌లో డిప్యూటి మేయర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏది ఏమైనప్పటికి ఎండతీవ్రత, విద్యార్థులకు పరీక్షల సమయం, వివాహాలు, ఫంక్షన్ల కారణంగా ఈ ఏడాది హోళీలో అంత పసలేదని ప్రజలు అనుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు, అధికారులు, అనధికారులు, వ్యాపారులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకుని స్వీట్స్ పంచుకున్నారు. అందుబాటులో లేని బంధువులకు, స్నేహితులకు ఫోన్లు, వాట్సప్, ఫేస్‌బుక్‌లు, మెస్సెంజర్‌ల ద్వారా హోళీ శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం. మంగళవారం అర్థరాత్రి నుండే నగరంలోని దాదాపు అన్ని కూడళ్ళ వద్ద కాముడి దహనం చేశారు. దహనానికి ముందు అనేక మంది ఔత్సాహికులు అక్కడకు చేరుకుని ఆ మంటల చుట్టూ డప్పుదరువుల మద్య కేరింతలు కొడుతూ తిరుగుతూ ఆనందించారు. నగరంలోని ఆయా డివిజన్లలోని కార్పోరేటర్లు ప్రత్యేకంగా హోలీ కార్యక్రమాలు నిర్వహించారు.

హోలీ వేడుకల్లో పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మార్చి 23: స్థానిక పోలీసులతో కలిసి జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం, ఏఎస్పీ సాయికృష్ణలు బుధవారం హోలీ సంబురాల్గొ పాల్గొన్నారు. ఎస్పీ ఖాసీంకు ఏఎస్పీతో సాయికృష్ణతో పాటు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ అశోక్‌కుమార్, ఇంటిలిజెన్స్ డిఎస్పీ బాలకిషన్‌తో పాటు ఆయా స్టేషన్ల సిఐలు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయానే్న ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ, ఏఎస్పీలకు రంగులు చల్లి సంబురాల్లో పాల్గొన్నారు. ఎస్పీ, ఏఎస్పీ స్వయంగా డప్పు కొడుతూ సంబురాల్లో పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన
సత్తుపల్లి, మార్చి 23 : పట్టణంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరారవు శంకుస్థాపనలు చేశారు. రూ.33 కోట్లతో సత్తుపల్లి నుండి వెంకటాపురం వరకు విజయవాడ రహదారి విస్తరణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. జవహర్‌నగర్‌లో రూ.2కోట్లతో చేపట్టు అభివృద్ధి పనుల్లో బాగంగా పేదలు నివసించే ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, నిర్మిస్తామన్నారు.
మంచినీరు ప్రతి రోజు నగరపంచాయితీ సరఫరా చేయటం లేదని మహిళలు చెప్పగా నగరపంచాయితీ కమీషనర్ శ్రీనివాస్‌ను పిలిచి కారణాలను తెలుసుకున్నారు. పైప్‌లైన్‌ల నిర్మాణాలకు వెంటనే అంచనాలను రూపొందించాలన్నారు. అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా అవసరమైన మేరకు మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. చౌక దుకాణాలు 6వ తేది నుంచి తెరిచి 15వ తేది కల్లా మూసివేస్తున్నారని మహిళలు తెలుపగా తహాశీల్దార్ దొడ్డా పుల్లయ్యను పిలిచి పేదలకు అందేబాటులో ఉండే విధంగా డీలర్లతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.అనంతరం రూ. 1.20 కోట్లు బ్యాంక్ లింకేజీ చెక్కును 32 డ్వాక్రా సంఘాలకు ఆయన అందించారు.
కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డిసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ళ కృష్ణయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చల్లగుళ్ళ నరసింహారావు, గాదె సత్యనారాయణ, ఆర్‌ఐ హుస్సేన్, పంచాయితీ కమీషనర్ దొడ్డాకుల స్వాతి, మెప్మా సుజాత కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.