ఖమ్మం

హైర్‌బస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఇఫ్టూ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 22: హైర్‌బస్ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్‌ను జమ చేయాలని, పిఎఫ్‌లో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ వెంటనే జరిపించాలని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం డిమాండ్ చేశారు. శుక్రవారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో హైర్‌బస్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ సుధాకర్ అధ్యక్షతన జరిగిన జనరల్‌బాడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు రావల్సిన పిఎఫ్‌ను యజమానులు జమ చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల జీతం, ఆర్‌టిసి కార్పొరేషన్ నుండి పిఎఫ్ జమ అవుతుందని దానిపై బస్ యజమానులకు ఎటువంటి హక్కులేదన్నారు. కాని కార్మికులపై వత్తిడి తెచ్చి వారి ఎకౌంట్‌లోని సొమ్మును తీసుకోవడం అనైతిక చర్యన్నారు. ఇప్పటికైనా కార్మికులకు అందాల్సిన సొమ్మును వెంటనే యజమాన్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్‌లో జరుగుతున్న అవకతవకలను ఎదుర్కొనేందుకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఇఫ్టూ జిల్లా కార్యదర్శి జి రామయ్య, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు, నాయకులు నాగేశ్వరరావు, ఆవుల అశోక్, విప్లవ్‌కుమార్, బాషా తదితరులు పాల్గొన్నారు.