ఖమ్మం

ఎరువు మొక్కలు రైతులకు ఎంతో లాభదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జూలై 22: హరితహారంలో రైతులు పొలంగట్లపై ఎరువు మొక్కలు (మాద్రి) నాటినట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయశాఖ ఎడిఏ నర్సింహారావు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ దినోత్సవం, హరితహారంలో భాగంగా వ్యవసాయాధికారులు శుక్రవారం మండలపరిధిలోని విశ్వనాథపురం గ్రామంలో రైతులతో కలిసి పొలం గట్లపై ఎరువుమొక్కలు, టేకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎడిఎ మాట్లాడుతూ ఎరువుమొక్కలు గట్లపై నాటటం వల్ల ఎండిన చెట్టు ఆకులు, క్మొమ్మలు సాగునేలపై పడి ఎరువుగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ సందర్భంగా గట్లపై 2500 ఎరువు మొక్కలు, 5వేలు టేకు మొక్కలు రైతులతో కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వలసాల జయలక్ష్మి, జెడ్‌పిటిసీ జర్పుల లీలావతి, ఎఒ సురేష్, పశువైద్యాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ సర్వయ్య, ఎఇఒ ప్రణూష, బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మొక్కలు నాటడం
బాధ్యతగా తీసుకోవాలి
ముదిగొండ: మొక్కలు నాటటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జెడిఏ మణిమాల, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావులు అన్నారు. మండల పరిధిలోని యడవల్లి, పమ్మి గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో గట్లపై శుక్రవారం మొక్కలు నాటారు. యడవల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో, పమ్మి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీలకు అతీతంగా మొక్కలు నాటాలన్నారు.రైతులు తమ పంట పొలాల్లో గట్లపై మొక్కలు నాటేందుకు వ్యవసాయ శాఖ వారి సలహాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహాసీల్ధార్ రమాదేవి, ఎంపిడీవో నర్మద, వ్యవసాయాధికారి అరుణ్‌బాబు, ఖమ్మం జిల్లా విజయ డెయిరి చైర్మన్ సామినేని హరిప్రసాద్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పొట్ల ప్రసాద్, వైస్ ఎంపిపి పచ్చా సీతారామయ్య, సర్పంచ్‌లు సుతారి శ్రీదేవి, వాచేపల్లి లక్ష్మారెడ్డి, పడిశాల భద్రయ్య, కుక్కల లాజర్, ఇవోఆర్డీ శ్రీనివాసరావు, ఎం ఈవో మద్దినేని నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సంపత్ పాల్గొన్నారు.
బజ్యాతండాలో...
కారేపల్లి: హరితహారం కార్యక్రమాన్ని శుక్రవారం మండల పరిధిలోని విశ్వనాధపల్లి పంచాయతీ బజ్యాతండ గ్రామంలో మండల వ్యవసాయశాఖా ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ భూములలో మండల పరిషత్ అధ్యక్షురాలు బాణోత్ పద్మావతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలాల గట్లపై మొక్కలు పెంపకం చేపట్టాలని, తద్వారా వ్యవసాయ పనులకు వచ్చే వారు సేదతీరుతారన్నారు. కార్యక్రమంలో ఏవో అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సంవత్సరం అపరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అజ్మీరా కాంతి, తహాశీల్దార్ మంగిలాల్, ఎంపిడివో ఎన్ శాంతాదేవి, ఎంఇవో జడ్ ఏసుదాసు, ఐబీ ఏఇ టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు టేకు మొక్కల పంపిణీ
కామేపల్లి: హరితహారం ద్వారా అందజేస్తున్న మొక్కలను రైతులు తమ పొలం గట్లపై నాటుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జడ్పీటిసి మేకల మల్లిబాబుయాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హరిత వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో రైతులకు టేకు మొక్కలు పంపిణీ చేశారు. రైతులు పొలంగట్లపై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులు తమ పొలంగట్లపై ప్రభుత్వం అందించే మొక్కలు నాటుకున్నట్లయితే భూసార పరిరక్షణ, గట్లు పటిష్టంగా ఉంటాయని తెలిపారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు మొక్కలు నాటుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ముచ్చర్ల, కొమ్మినేపల్లి, పొనె్నకల్లు, కామేపల్లి తదితర గ్రామాలలో సుమారు ఐదువేల టేకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మణస్వామి, ఎంపిడిఓ జివి రమణ, ఎఇఓ రాజు, అధికారులు పాల్గొన్నారు.