ఖమ్మం

కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూలై 22: కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న జాతీయ సమ్మెను తలపెట్టినట్లు కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు జలీల్, నర్సింహాన్, పాలడుగు భాస్కర్ తదితరులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టిఎన్జీవోస్ ఫంక్షన్ హాలులో ఐఎన్‌టియుసి, ఏఐటియుసి, సిఐటియు, ఎఫ్‌ఐటియు, టిఆర్‌ఎస్‌కెవి, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యితిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కార్మికులపై కక్షసాధింపు దోరణి అవలంభిస్తుందన్నారు. కార్మిక చట్టాలు ఐదు లేబర్ కోడ్‌లుగా తేవటాన్ని వ్యతిరేకిస్తూ, కనీస వేతనం 15వేలుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పిఎఫ్, ఈఎస్‌ఐ వంటివాటిల్లో మార్పులు లేకుండా ప్రభుత్వ సంస్థల అమ్మకాలను ఆపటంతో పాటు మూతపడ్డ పరిశ్రమలను తిరిగి పునరుద్దరించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్లను సాధించేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అసంఘటిత రంగ కార్మికుల ఆర్‌టిఎస్ బిల్లును వ్యతిరేకిస్తూ రక్షణ కోసం చట్టాలను తేవాలన్నారు. కార్మికులు ఐక్యతతో సెప్టెంబర్ 2న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు డివి సూర్యం, రాంబాబు, గడ్డం లింగమూర్తి, వెంకటనారాయణ, ముక్తార్‌పాషా, బిజె క్లైమెంట్, లింగయ్య, విష్ణు, కాసాని నాగేశ్వరరావు, నారపాటి నరేష్, విశ్వనాథం పాల్గొన్నారు.