ఖమ్మం

ప్రతి మొక్కకు లెక్కచెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), జూలై 25: హరితహారంలో మొక్కలను నాటడమే కాకుండా వాటిని ప్రభుత్వ ఆస్తిగా భావించి ప్రతి మొక్కకు లెక్కచెప్పాలని జిల్లా ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసీం అన్నారు. సోమవారం స్థానిక సెయింట్‌మేరిస్, పోలీస్‌కోర్టర్స్, ఇందిరానగర్ మసీద్ ఆవరణంలోని ఖబరస్థాన్ చుట్టూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం ఏడు లక్షల పదివేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. డిఎస్పీ కార్యాలయాలు, సర్కిల్స్ పరిధిలోని గ్రామాలు, రహదారులకు ఇరువైపులు మొక్కలు నాటి ప్రజల్లో చైతన్యం తెచ్చామన్నారు. ఇందులో స్వచ్ఛంద సంస్థలతో పాటు మాజీ మావొహిస్టులను సైతం బాగస్వామ్యులను చేశామన్నారు. విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువత సహకారంతో పెద్దఎత్తును మొక్కలు నాటామన్నారు. మరింత పెద్దఎత్తున హరితహారాన్ని కొనసాగించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాను పచ్చని చెట్లతో తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎస్పీ పాల్గొన్నారు. సర్కిల్స్, స్టేషన్ల పరిధిలో పోలీసులు నాటిన మొక్కలకు లెక్క చెప్పెందుకు జనరల్ డైరీ(జిడి)నమోదు చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్ ద్వారా జిల్లా కేంద్రానికి వస్తున్న సమాచారాన్ని రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి రక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నాటిన మొక్కలను జిపిఎస్‌కు అనుసంధానం చేశామని, ఎవరైన చూడవచ్చన్నారు. హరితహారం ద్వారా నాటిన మొక్కలే బావితరాలకు కలుష్యరహిత సమాజాన్ని అందించేందుకు దోహదపడతాయన్నారు. దత్తత గ్రామాలు, ఆసుపత్రులు, గుర్తించిన ప్రదేశాల్లో మొక్కలు విస్తృతంగా నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ సాయికృష్ణ, డిఎస్పీ సురేష్‌కుమార్, సిఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.