ఖమ్మం

రాష్ట్రంలోనే ఖమ్మంను ఆదర్శంగా నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 25: తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం పట్టణాన్ని ఆదర్శంగా నిలిపేలా సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌తో పాటు హౌజింగ్ పిడితో ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నగరంలో సుందరీకరణ చేసే ప్రక్రియలో ప్లాంటేషన్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎనె్నస్పీ కాల్వ, లకారం చెరువుల సుందరీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్ లైటింగ్‌కు ఎల్‌ఇడి బల్బులు ఉపయోగించాలని కోరుతూనే మున్సిపల్ శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సిఎండిలతో ఫోన్ ద్వారా మాట్లాడి ఎల్‌ఇడి బల్బులు సరఫరా చేయాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నియోజక వర్గ వారీగా టెండర్లను పిలిచామని, అందులో ఎనిమిది చోట్ల ప్రక్రియ టెండర్లు కూడా పూర్తయినట్లు పిడి వివరించారు. కాగా ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఎర్రవెళ్ళిలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మించిన కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడినట్లు కమిషనర్ వివరించారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా వందకోట్లు కేటాయించినందున ఆ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ మురళీప్రసాద్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.