ఖమ్మం

గోమాత ద్వారానే సుఖ సౌఖ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూలై 28: ప్రతి ఒక్కరికి గోమాత ద్వారానే సుఖ సౌఖ్యాలు లభిస్తాయని గోప్రచారకుడు, శ్రీ హహివరాహ ట్రస్ట్ కార్యదర్శి కుందుర్తి మహికిరణ్‌శర్మ అన్నారు. గురువారం గాయత్రి దేవాలయం వద్ద జరిగే గో - వృషభ కల్యాణానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో అనేక మంది గోమాతను పూజించటం మరిచారని, దీని ద్వారా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయనే విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్నారన్నారు. అనేక మంది ఇటీవల కాలంలో గోవు కోసం వెతికే పరిస్థితి దాపురించటం బాధాకరమన్నారు. అందుకనే గోమాతపై ప్రచారం చేస్తున్నామన్నారు. గోమాతకు పూజిస్తే 33కోట్ల దేవతాలకు పూజించిన దానితో సమానమన్నారు. ఇదిలా ఉండగా గోవులను పెంచుకునేందుకు ఆసక్తి ఉన్న వారికి ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, వారిని చైతన్యవంతులను చేసిన అనంతరం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా గోశాలను ఏర్పాటు చేయటం, గోవులను అందించటం జరుగుతుందన్నారు. ఇప్పటికే సుమారు 20వేల గోవులను ఆసక్తి కలిగిన రైతులకు అందించటంతో పాటు గోశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గోవులను పూజించటం ఒక వంతయితే, గో మూత్ర ద్వారానే అనేక రోగాలు తగ్గుతాయనే స్పష్టం చేశారు.