ఖమ్మం

ఎంసెట్ లీకేజ్‌లో ఖమ్మంకు పాత్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 28: ఎంసెట్ మెడికల్ పరీక్షలో పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుండగా, అందులో ఖమ్మం జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులకు లీకేజ్ వ్యవహారంలో పాత్ర ఉన్నదని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఖమ్మం నగరానికి చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు రూరల్ మండలానికి చెందిన ఒకరు, అర్బన్ మండలానికి చెందిన వారు ఒకరు, సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంసెట్ లీకేజ్ వ్యవహారం బహిర్గతమైన నాటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఖమ్మంలో కనిపించడం లేదని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు, సిఐడి వర్గాలు విస్తృతంగా విచారించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఖమ్మం నగరానికి చెందిన ఓ కార్పొరేట్ కళాశాల యాజమాన్యానికి ఇందులో పాత్ర ఉన్నదని సమాచారం. అలాగే ఖమ్మం పట్టణానికి చెందిన మరో ఇద్దరు వ్యాపారులు తమ పిల్లల కోసం ఈ లీకేజ్ వ్యవహారంలో భాగస్వాములైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు వారం ముందే కళాశాల నుంచి బయటకు వచ్చి ఈ వ్యవహారంలో పాలుపంచుకొని మెరుగైన ఫలితాన్ని సాధించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సదరు విద్యార్థుల ఇంటితో పాటు సెల్‌ఫోన్, బంధువుల ఇళ్లపై కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఎంసెట్ లీకేజ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే సదరు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అరెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిని విచారించిన అధికారులు అరెస్ట్ కోసం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. కాగా కళాశాలలో జరిగిన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంసెట్‌లో మెరుగైన ర్యాంక్‌ను దక్కించుకోవడానికి గల కారణాలను, ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌లలో వారికి వచ్చిన మార్కులపై కూడా విచారిస్తున్నట్లు తెలిసింది.