ఖమ్మం

ఎంసెట్ లీకేజికి కారకులైన మంత్రులను బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 28: ఎంసెట్-2 లీకేజికి కారకులైన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ శరత్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డుమీద బైటాయించి ధర్నా నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం నుంచి అర్థనగ్నగా ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ లీకేజిలు నిరంతరం జరుగుతున్నాయని, తెలంగాణ ఏర్పడితే వాటిని నిర్మూలిస్తానని చెప్పిన కెసిఆర్ పాలనలో ఎంసెట్ లీకైనప్పటికీ కనీసం స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసెట్ లీకేజి వల్ల మెరిట్ విద్యార్థులకు ఎంతో నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు నిజాయితీగా పరీక్షలు రాసినప్పటికీ ర్యాంకులు రాకపోవడంతో వారు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే లీకేజికి పాల్పడిన వారిపై తక్షణమే చట్టరీత్య చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎం సురేష్, నాయకులు కె శ్రీను, ఎన్ ఆజాద్, రాజేష్, మధు, వెంకటేష్, వేణు, మస్తాన్, చారి తదితరులు పాల్గొన్నారు.