ఖమ్మం

కమ్యూనిస్టుల వల్లే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (కల్చరల్), జూలై 29: రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి జరిగిందంటే అది కమ్యూనిస్టుల వల్లేనని ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై శుక్రవారం ఖమ్మంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ మొదలుకొని నేడు జిల్లాలో శంకుస్ధాపనలు చేసిన ప్రాజెక్టుల వరకు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల క్రింద భూములు, ఇళ్ళు కోల్పోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల అభివృద్ధి నిరోధకులమైనామా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రకటించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. డిపిఆర్ ప్రకటించకుండానే టెండర్ల దాక వెళ్ళడం వెనుక ఏమున్నదో తెలియజేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లాకు ఉన్న జల వనరులు ఏ జిల్లాకు లేవన్నారు. కానీ వాటిని వినియోగించుకొని సాగునీరు అందించడంలో ప్రభుత్వాధికారులు పూర్తిగా విఫలమైనారని ఆరోపించారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై అఖిలపక్షభేటీని ఏర్పాటు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు ప్రభుత్వానికి సరైంది కాదన్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నిర్వాసితులు ఎంత భూమిని కోల్పోతున్నారు, ఎన్ని ఎకరాల భూమి సాగులోకి వస్తుందో, నిర్వాసితులకు ఎంత పరిహారం ఇస్తున్నారో తెలిజేయాలన్నారు. ప్రాజెకుల నిర్మాణంలో ఆయా ప్రాంతాల రైతులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలి తప్ప, మెజార్టీ ఉందని ఏకపక్షనిర్ణయం తీసుకోవడం సరైందికాదన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులను వృధా చేసి రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేసే అధికారాన్ని ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, భూ నిర్వాసితుల జిల్లా కన్వీనర్ నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపియం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శనరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు రాయల చంద్రశేఖర్, టిడిపి జిల్లా నాయకులు తాళ్ళూరి జీవన్, తోటకూరి శివయ్య, రైతు కూలీ సంఘం నాయకులు కె నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, తాతా భాస్కర్‌రావు, బొంతురాంబాబు, దుగ్గి కృష్ణ, మెరుగు సత్యనారాయణ, రామనాధం, వేదగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.