ఖమ్మం

హెల్మెట్ ధరించనివారి నుంచి రూ.11లక్షల జరిమానా వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), జూలై 31: సుప్రిం కోర్టు ఆదేశాలను అనుసరించి ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు భారీ జరిమానాలు విధించారు. జులై 1నుంచి చివరినాటికి 3800మందిపై కేసులు నమోదు చేసి వారినుంచి 11లక్షల రూపాయలను జరిమాన రూపంలో వసూలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ నరేష్‌రేడ్డి మాట్లాడుతూ హెల్మెట్లు ధరించకుండ ఉండేందుకు కోర్టులో కేసులు ఉన్నట్లు కొందరు చేస్తున్న అసత్య ప్రచారం నమ్మవద్దని సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని, లేనిచో అట్టివారిపై జరిమాన విధించడంతో పాటు చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్లు ఉండి ధరించకుండా కుంటి సాకులు చెబుతున్నవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హెల్మెట్ వాడకం, రోడ్డుప్రమాదాలపై పవర్‌పాయింట్ ద్వారా వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.