ఖమ్మం

పార్టీల మధ్య పోడు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 4: అటవీ భూమిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేస్తున్నారని, పంటను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. హరితహారం పేరుతో పేదల పొట్టలు కొడుతున్నారంటూ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, సిపిఐ, సిపిఎంలు క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆందోళనలు చేస్తున్నాయి. ఇది గత కొనే్నళ్ళుగా జరుగుతూనే ఉంది. కానీ ఇటీవల న్యూడెమోక్రసి నేతలు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ చేసిన ఆందోళనలకు టిఆర్‌ఎస్ నేతలు స్పందించి న్యూడెమోక్రసి నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పోడు పోరాటం కాస్త పార్టీల మధ్య పోరుగా మారింది. న్యూడెమోక్రసి నేతలు స్వలాభం కోసం పోడు సాగుదారులను రెచ్చగొడుతున్నారని, గిరిజనుల పేరుతో గిరిజనేతరులే వ్యవసాయం చేస్తున్నారని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి టిఆర్‌ఎస్ నేతలు పోడు పేరుతో ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారో లెక్కలతో సహా బహిర్గతం చేశారు. దీంతో టిఆర్‌ఎస్ నేతల్లో ఒక్క సారిగా ఆందోళన మొదలైంది. పార్టీ చేసిన విమర్శకు తమ జిల్లా నేతలు ప్రతి విమర్శ చేస్తే న్యూడెమోక్రసి నేతలు తమ పార్టీలోని నేతల వివరాలన్నీ బహిర్గతం చేయటంతో అవాక్కయ్యారు. కాగా క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలతో ఎన్డీ నేతలు ప్రకటించటంతో బహిరంగ చర్చకు వెళ్ళే ఆలోచనను అధికార పార్టీ నేతలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల చేతిలో ఉన్న పోడు భూముల వివరాలు బయటకు రావటంతో శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో ఇదే ప్రధానాంశం కానున్నది. మరో వైపు టిఆర్‌ఎస్ జిల్లా నేతల వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండల స్థాయి నేతలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గ్రామాల వారిగా టిఆర్‌ఎస్ నేతల కనుసన్నల్లో ఉన్న భూముల వివరాలను బహిర్గతం చేసి ప్రజాక్షేత్రంలో పెట్టేందుకు వామపక్షపార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న పోడు పోరు కాస్తా పార్టీల మధ్య పోరాటంగా మారటంతో కొన్ని రోజుల్లోనే జిల్లాలోని రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది.