ఖమ్మం

రూ.4.50 కోట్ల టిడిడి నిధులతో భక్తులకు వసతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 11: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల వసతి కోసం టిటిడి రూ.4.50కోట్లతో వసతి గృహాన్ని నిర్మిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, టిటిడి సభ్యులు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. శ్రీసీతారామచంద్రస్వామిని గురువారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబుతో కలిసి విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానీషా కల్యాణ మండపం వెనుక ఉన్న అరఎకరం స్థలాన్ని పరిశీలించామని అక్కడే నిర్మిస్తామని అన్నారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ రమేశ్‌బాబు ప్రతిపాదన ఇవ్వాలని సూచించారు. టిటిడి ద్వారా ఆలయాలకు 70 శాతం సబ్సిడీపై పంచలోహ విగ్రహాలను ఇస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 30 ఆలయాలకు ఇలా ఇచ్చామన్నారు. స్తంబాద్రిలో నర్సింహస్వామి ఆలయంలో గరుత్మంతుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు టిటిడి కృషి చేస్తుందన్నారు. దళిత, గిరిజనుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు రామాలయ భజన మందిరాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో రూ.2లక్షలు చెల్లించిన గ్రామాలకు ఆలయం నిర్మాణానికి టీటీడీ రూ.8లక్షలు కలిపి రూ.10లక్షలు ఇచ్చేదని, ఇపుడు ఈ నిబంధన మార్చి నేరుగా గ్రామానికే రూ.8లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 15 నూతన ఆలయాల నిర్మాణానికి ఈ నిధులు ఇచ్చినట్లు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణ మండపాలను ఆధునీకరించేందుకు టీటీడీ నడుంబిగించిందన్నారు. ఖమ్మంలో మండపానికి రూ.50లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. టీటీడీ అన్నదానం పథకానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా 40శాతం బియ్యం సరఫరా చేయాలనే నిబంధనను టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల సంబంధాలు మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుందన్నారు. నూతన దేవాలయాలకు విగ్రహాలను టీటీడీ ఉచితంగా ఇస్తుందన్నారు.
ఖమ్మం వద్ద గోశాల ఆధునీకరణకు రూ.30లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ఫణీశ్వరమ్మ, కొడాలి శ్రీనివాసన్, అజీం, కంభంపాటి సురేశ్‌కుమార్, ఎంపీపీ శాంతమ్మ, జెడ్పీటీసీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.