ఖమ్మం

నాటక రంగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌రికార్డు సాధనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (కల్చరల్), మార్చి 27: వంద నిమిషాల నిడివి గల ఏకపాత్రాభినయంగా అలెగ్జాండర్ అనే నాటికను ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనేదే తన ఏకైక లక్ష్యమని ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక భక్తరామదాస్ కళాక్షేత్రంలో జరిగిన నెల నెల వెనె్నల కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటికలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలుగు రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కలుపుకొని ఇప్పటికే 51 ప్రదర్శనలు ఇచ్చానన్నారు. త్వరలో భద్రాచలంలో జరిగే ఉగాది నాటకోత్సవాల్లో ఈ నాటిక 52వ ప్రదర్శనను ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితమే ఈ నాటకాన్ని ఇదే వేదికపై ప్రదర్శించినప్పుడు ఖమ్మం ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. 1984వ సంవత్సరంలో బ్రహ్మపుత్రుడు అనే చలన చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన తాను ఇప్పటి వరకు 300 తెలుగు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. ఇతర భాషల్లో మరో 12 చిత్రాలు చేసినట్లు వివరించారు. 2000 సంవత్సరంలో జయం మనదేరా చిత్రానికి బెస్ట్ విలన్‌గా నంది అవార్డు పొందినట్లు తెలిపారు. ఇంకా సరైనోడు, బ్రహ్మోత్సవం, శరణం గచ్చామిలతో పాటు మరి కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. దాసరి నారాయంరావు, రామానాయుడు వంటి మహానుభావుల వల్లే సినీ జీవితంలో నిలబడగలిగానన్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కొత్త వారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతోనే అవకాశాలు వచ్చినా వదులుకుంటున్నానన్నారు. వెండి తెరపై ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి రంగస్థలంపై ఉన్న మక్కువతోనే ఖమ్మం కళాకారులు ఆహ్వానించగానే ఖమ్మంవైపు పరుగులు తీశానన్నారు. వెండి తెరపై ఎప్పుడు కామెడియన్‌గా,విలన్‌గా,కామెడీ విలన్‌గా చేస్తున్నప్పటికీ కరుణ, దయ, జాలిగొలిపే పాత్రలకోసం ఎదురుచూస్తున్నానని, అలాంటి అవకాశం లభించడం లేదని ఓకింత నిరాశని వ్యక్తం చేశారు. 12 ఏళ్ళపాటు వెండితెరపై బిజీగా గడిపిన తనకు ఇకనుండి నాటక రంగంతోను, కుంటుంబంతో గడపాలని ఉందన్నారు.