ఖమ్మం

మహిళలపై అసభ్యంగాప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్, అగస్ట్ 13: పోడుసాగుచేసుకుంటున్న అమాయక గిరిజనులు పోడుభూములనుండి తరిమేసేందుకు స్థానిక పోలీస్, ఫారెస్ట్ అధికారులు నైజాం నవాబులను మరిపించేలా ప్రవర్తిస్తున్నారని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. శుక్రవారం మండలపరిధిలోని రేగళ్ల ప్రాంతంలోని పోడుభూముల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ స్థానిక తహశీల్దార్ అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు గిరిజనులపై విచక్షణారహితంగా దాడులు చేయడమే కాకుండా గిరిజనమహిళలపై దుశ్చర్యలకు పాల్పడం దారుణమన్నారు. అంతేకాకుండా చేతికివచ్చిన పంటను ధ్వంసం చేయడం సరైందికాదన్నారు. పోడుభూములను కాపాడుకోవాలని చూసినందుకు గిరిజన మహిళల చీరలూడదీయడం ఏం సంస్కృతని ప్రశ్నించారు. బంగారు తెలంగాణా అంటే మహిళలను అవమానపర్చడమేనా అని అన్నారు. అభివృద్ధి పేరుతో అమాయక గిరిజనుల భూములను గుంజుకోవాలని చూస్తే సహించేదిలేదన్నారు. గిరిజన మహిళలకు జరిగిన అవమానానికి స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన మహిళలపై దుశ్చర్యలకు పాల్పడిన వారందరిపై చర్యలు చర్యలు తీసుకునేవరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. గిరిజనులకు పోడుభూములు దక్కేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని, పోడుసాగుదారులకు అండగా అఖిలపక్షం ఉంటుందన్నారు.మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీస్, అటవీశాఖ సిబ్బందితో పాటు తహశీల్దార్ అశోకచక్రవర్తి, త్రీటౌన్ సిఐ రాజగోపాల్, డిఎఫ్‌ఓ శాంతారాం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులు, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని నాయకులు తెలిపారు. సమావేశంలో సిపిఎం రాష్టక్రమిటి సభ్యులు కాసాని ఐలయ్య, సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, కాంగ్రెస్‌పార్టీ జిల్లాకార్యదర్శి కాసుల వెంకట్, సిపిఎం పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కార్యదర్శి చార్వాక, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గుగులోత్ ధర్మాలు ప్రసంగించగా నాయకులు కొండపల్లి పావన్, నల్లమల సత్యనారాయణ, ఇట్టి వెంకటరావు, లావుడ్యా సత్యనారాయణ, తాటిపర్తి అనిల్, ఆదివాసీ సంఘం నాయకులు వాసం రామకృష్ణ, ఎల్‌హెచ్‌పిఎస్ నాయకులు బానోత్ రమేష్, బిఎస్‌పి నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, పోడుసాగుదారులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.

*