ఖమ్మం

రైతు బాగుకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వారావుపేట, ఆగస్టు 16: అన్ని విధాలా రైతుకు సబ్సిడీలు ఇచ్చి బతికించినప్పుడే దేశానికి మనుగడ ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అందువల్లనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సబ్సిడీలు కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణ విభాగాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందాలంటే సబ్సిడీలు ఇవ్వక తప్పడం లేదని, ఆ దిశగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు గాను రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు చాలావరకు నీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరుశాతం సబ్సిడీపై డ్రిఫ్ ఇరిగేషన్లు అందిస్తున్నామని, ఇతరులకు 80, 90శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. రూ.80 నుంచి రూ.90 కోట్ల డ్రిప్ ఇరిగేషన్‌కే నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు సాగునీరు ఎలా అని ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సామర్థ్యం మేరకు నీటిమట్టం నమోదు కాకపోవడంతో రాకపోవడంతో రెండేళ్లుగా ఆయకట్టు కింద భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయని, వాటిని చూస్తే కన్నీరు వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బోరు, విద్యుత్ మోటార్లు లేని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఖమ్మం జిల్లాలో అధిక విస్తీర్ణంలో రైతులు పామాయిల్‌ను సాగు చేస్తున్నారని, దీంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఇదే తరహాలో నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పామాయిల్ సాగు చేసేందుకు భూసార పరీక్షలు చేసి అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పామాయిల్ రిఫైనరీ తయారు చేసేందుకు గాను రూ.20 కోట్ల నిధులు ఈ బడ్జెట్‌లో పెట్టాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు సూచించామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలంగాణలో కాళేశ్వరం వద్ద నీరు ఉందని, అదే నీరు ప్రస్తుతం పంటలకు సాగనీరుగా ఉపయోగపడుతోందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా 1400 టీఎంసీల నీరు గోదావరిలోకి వృథాగా పోతోందని అన్నారు. 974 టీఎంసీల నీరు తెలంగాణకు కావాలన్నారు. తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో 400 ప్రాజెక్టులు కట్టారని, దీంతో శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చే పరిస్థితి కానరావడం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యుత్ లేక అంధకారంలో మగ్గాల్సి ఉంటుందని ఒక ముఖ్యమంత్రి అన్నారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు. 24 గంటల విద్యుత్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఆయన తెలిపారు. అదే విధంగా రైతులకు వ్యవసాయానికి గాను నిరంతరం 9 గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం అడవులు అంతరించి పోయినందున వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, మొక్కలు నాటి హరితహారాన్ని కాపాడేందుకు రైతులు పోటీ పడుతూ పాలు పంచుకుంటూ మొక్కలు పెంచుతున్నారని అన్నారు. తద్వారా సకాలంలో వర్షాలు పడి చెరువులు, కుంటలు ప్రాజెక్టులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామన్నారు.