ఖమ్మం

కలకలం రేపిన మావో లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 18: ఖమ్మం కేంద్రంగా నరహంతకుడు నరుూం దందాలు కొనసాగించినట్లుగా ఇటీవల కొన్ని ఆధారాలు లభించాయి. అతని దందాలు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోనూ కొనసాగిస్తున్నట్లుగా తాజాగా బుధవారం దంతెవాడ జిల్లా దబ్బాకున్నా ఎన్‌కౌంటల్లో లభ్యమైన మావోయిస్టుల లేఖ రుజువు చేసింది. అందులో బస్తర్ ఐజీ కల్లూరిని హతమార్చేందుకు మావోయిస్టులు నరుూంకు సుపారీ ఇచ్చినట్లు లేఖ ద్వారా తెలియడంతో ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో విశే్లషిస్తున్నారు. మావోయిస్టులకు దండకారణ్యంలో కల్లూరి కంటకంగా మారారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ ద్వారా మావోయిస్టు పార్టీని అణచివేయడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని హతమార్చడం ద్వారా మావోయిస్టు పార్టీ తిరిగి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందని నక్సల్స్ వ్యూహం. అయితే మావోయిస్టులే అతన్ని లక్ష్యంగా చేసుకున్నా లొంగిన నక్సల్స్ ద్వారా పోలీసులు ఎప్పటికపుడు సమాచారాన్ని సేకరించుకుని జాగ్రత్త పడుతున్నారు. శత్రువును శత్రువుతోనే అంతమొందించాలనే వ్యూహంలో భాగంగా తమకు ప్రధాన శత్రువైన నరుూంను ఈ ఆపరేషన్‌కు మావోయిస్టులు వాడుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వర్గీస్ అనే ఏరియా కమిటీ సభ్యుడు జగదీశ్ అనే మావోయిస్టు అగ్రనేతకు రాసిన లేఖ బయట పడడంతో కల్లూరిని హతమార్చేందుకు నక్సల్స్ పన్నిన వ్యూహం బట్టబయలైంది.
ఖమ్మం నుంచే రాకపోకలు: రైలు, రహదారి మార్గాల ద్వారా ఖమ్మం నుంచి నరుూం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాడా? అనే కోణంలో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. మావోయిస్టుల సమాచారం కోసం నరుూంను ఛత్తీస్‌గఢ్‌లోని కొందరు ఐపిఎస్‌లు కూడా వాడుకున్నట్లు ఇటీవల అతని డైరీ ద్వారా వెలుగు చూసినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు సన్నిహితంగా ఉంటున్న నరుూం నమ్మకంగా ఉంటూనే కల్లూరి లాంటి పోలీసు ఉన్నతాధికారిని మట్టుబెట్టేందుకు మావోయిస్టుల నుంచి సుపారీ తీసుకున్నాడనే అనే అనుమానాలు కల్గుతున్నాయి. మార్చిలో మావోయిస్టులు లేఖ రాసుకున్నట్లుగా లభ్యమైన లేఖను బట్టి తెలుస్తోంది. అంటే ఈ ఏడాది నుంచే నరుూం తన ఆపరేషన్ కల్లూరి ప్రారంభించాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కల్లూరి తరుచూ భద్రాచలం వస్తుంటారు. ఖమ్మం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నరుూం భద్రాచలంలోనూ రెక్కీ నిర్వహించాడా? అనే కోణం నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం అతని గన్‌మెన్, డ్రైవర్, బావమరిది ఒకరు ఛత్తీస్‌గఢ్ పారిపోతూ చర్ల పోలీసులకు చిక్కాడు. ఆయుధంతో సహా పట్టుబడ్డ అతని అనుచరుడు స్వేచ్ఛగా అక్కడకు ఎలా వెళ్లాడనే కోణంలో దర్యాపు ప్రారంభమయింది. ప్రస్తుతం మావోయిస్టులు నరుూంకు సుపారీ ఇచ్చారన్న వార్త సంచలనంగా మారింది.