ఖమ్మం

పిహెచ్‌సి ముందు బాధితుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, ఆగస్టు 19: వైద్య సిబ్బంది వేసిన వ్యాక్సిన్ వికటించి 3 నెలల బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత తల్లిదండ్రులు, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు దుమ్ముగూడెం పిహెచ్‌సి ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. దుమ్ముగూడెం గ్రామానికి చెందిన జక్కుల నరేష్, మరియమ్మ దంపతులకు చెందిన మూడు నెలల బాలుడు గురువారం మృతిచెందిన సంగతి విదితమే. తమ కుమారుడికి దుమ్ముగూడెం వైద్యశాలలో బుధవారం వ్యాక్సిన్ వేశారని, అప్పటి నుంచి బాలుడు పాలు తాగకుండా ఏడుస్తూ ఇబ్బందులకు గురై మృతి చెందాడని పీహెచ్‌సీ ముందు బాలుడు కుటుంబీకులు, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అడిషన్ డీఎంహెచ్‌వో పుల్లయ్య పీహెచ్‌సీకి వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వ్యాక్సిన్ వేయడం వల్ల బాలుడు మృతి చెందలేదని, ఆ వ్యాక్సిన్ ఆ రోజు మరో 10 మంది పిల్లలకు వేశామని, మిగతా వారంతా బాగానే ఉన్నారని, బాలుడు పాలు తాగకుండా ఇబ్బందులు పడినప్పుడే పీహెచ్‌సీకి తీసుకొస్తే మెరుగైన వైద్యం అందించేవారమన్నారు. కనీస సమాచారం సిబ్బందికి తెలియజేయలేదన్నారు. ఏదేమైనా జరిగిన సంఘటన బాధాకరమని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా కనిపించలేదన్నారు.
బాధిత కుటుంబ సభ్యులు కడు పేదవారని, బాలుడి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించాలని ఎంఆర్‌పీఎస్ నాయకులు కొప్పుల తిరుపతిరావు, కొప్పుల మల్లూరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్పీటీసీ అనె్నం సత్యాలు, ఎంపీపీ తెల్లం సీతమ్మ, వై.శ్రీనుబాబు, వై.వంశీ, ఎండీ జానీపాషాలతో మాట్లాడి అందరూ కలిసి మానవత్వంతో రూ.7వేలను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో వారు ఆందోళన విరమించారు.