ఖమ్మం

వూపందుకున్న భ ద్రాచలం డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 21: నూతన జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ తాజాగా శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భద్రాచలం కేంద్రంగా గోదావరి పరివాహక ప్రాంత మండలాలను కలుపుతూ గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో గిరిజన సంఘాల నుంచి దానికి మద్దతు లభిస్తుంది. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క గిరిజన చట్టాలను ఉల్లంఘించకుండా శాస్ర్తియంగా గిరిజన ప్రాంతంమంతా ఒక జిల్లా పరిధిలోకి వచ్చేలా చూడాలని సూచించిన విషయం తెలిసిందే. మరో వైపు ఖమ్మం జిల్లాను ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం జిల్లాలుగా ఎందుకు ఏర్పాటు చేయకూడదని వారు చేసిన డిమాండ్‌కు జిల్లా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను ఒక్కొక్క దానిని మూడు, నాలుగు జిల్లాలుగా విభజించాలనుకున్న ప్రభుత్వం అంతే స్థాయిలో జనాభ, విస్తీర్ణం కలిగిన ఖమ్మం జిల్లాను కూడా అదే స్థాయిలో విభజించకపోవడంకు గల కారణాలను ప్రభుత్వం చెప్పాలని గిరిజన సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో సోమవారం విడుదల కానున్న ముసాయిదా ప్రకటన అనంతరం భద్రాచలం జిల్లా డిమాండ్ ఊపందుకునే అవకాశం ఉంది. గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని భద్రాచలం శాసనసభ్యుడైన సిపిఎంకు చెందిన సున్నం రాజయ్యతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. రెండోసారి అఖిలపక్ష సమావేశం జరిగేలోగానే ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ ఊపందుకుంటుంది.
కాగా ఖమ్మం, కొత్తగూడెం కేంద్రాలుగా ఏర్పడనున్న జిల్లాల పరిధిలో పనిచేసేందుకు ఉద్యోగుల విభజన దాదాపు పూర్తికావోచ్చింది. వారివారి స్థానికతను ఆధారంగా ఉద్యోగులను బదలాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.