ఖమ్మం

మునే్నరు గోళ్లపాడు ఆనకట్టకు ‘జలసిరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఆగస్టు 23: ఇటీవల రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మండలంలోని మునే్నరుపై ఉన్న గోళ్లపాడు ఆనకట్టను సుమారు 5.07 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. పనులు అసంపూర్తిగానే ఉన్నప్పటికీ ఆనకట్టకు ఏర్పడిన బుంగలు ముందుగానే పూడ్చివేయడంతో వృథాగా పోయే నీటికి అడ్డుకట్ట పడింది. దీంతో గోళ్లపాడు ఆనకట్ట జలసిరితో కళకళలాడుతోంది. ఫలితంగా మునే్నటికి ఇరువైపులా ఉన్న ఆయకట్టు రైతులు ఏటికి మోటార్లు అమర్చి వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చీ పంటలను విరివిగా సాగు చేస్తున్నారు. గోళ్లపాడు ఆనకట్ట పొంగి పొర్లే విధంగా నీరు ఉండటంతో రైతులు మోటార్ల ద్వారా ఆ నీటిని తరలించి పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పంటలను ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ ద్వారా పొలానికి మునే్నరు నీరు సుమారు ఐదారు అడుగుల ఎత్తులో ఒప్పొంగడంతో ఫౌంటైన్‌ను తలపిస్తోంది. ఆ దృశ్యం రోడ్డుపై వెళ్లే బాటసారులకు చూడ ముచ్చటగొలుపుతోంది.