ఖమ్మం

ఐఎన్‌టియుసి డోలాయమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 26: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తుండడంతో ఐఎన్‌టియుసి డోలాయమాన పరిస్థితిలో సతమతమవుతోంది. దీనికి ప్రధానకారణం ఐఎన్‌టియుసికి అనుబంధంగా సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్, సింగరేణి కాలరీస్ స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్‌లు రెండూ చలామణి కావడమే. ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి సత్తాచాటాలని సవాల్ చేసిన కోల్‌మైన్స్ యూనియన్ నాయకులు తాజాగా టిఆర్‌ఎస్ ఆనుబంధ టిబిజికెఎస్‌లో చేరడంతో కొంత గందరగోళ పరిస్థితికి దారితీసింది, యూనియన్‌లో కీలకపాత్ర పోషించే నాయకులు యూనియన్ మారడంతో నూతనజవసత్వాలు నింపుకునేందుకు నేతలు కసరత్తు ప్రారంభించారు. మరోవైపు స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు కూడా ఈసారి ఎన్నికలలో సత్తాచాటాలని ఉవ్విల్లూరుతున్నారు. ఈ రెండు యూనియన్లకు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి నాయకత్వం వహిస్తుండడం అయోమయానికి దారితీస్తోంది. అంతేకాకుండా ఈరెండు యూనియన్లను విలీనం చేసి పోటి చేయించాలనే ఆలోచనతో ఇటీవల హైద్రాబాద్‌లో సంజీవరెడ్డి నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. రెండూకలిసి పోటీచేయూలని ఏకాభిప్రాయానికి వచ్చారు. జాతీయస్థాయిలో ఎఐటియుసి, ఐఎన్‌టియుసి కలిసి పోటీచేయాలని సమాలోచనలు జరుగుతున్నాయని దీనికి నేతలు సిద్ధంగా ఉండాలని కూడా ఈసమావేశంలో సంజీవరెడ్డి సూచించారు. ఈసమావేశం తరువాత కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ నేతలలో ముఖ్యులు టిబిజికెఎస్ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఆ యూనియన్‌లో అత్యంత కీలక బాధ్యలు చేపట్టడం జరిగింది పరిణామాలు అనూహ్యంగా మారడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. తాజా పరిస్థితుల్లో రెండు యూనియన్లు కలిసి పోటీచేస్తాయా లేక రెండూ కలవడంతోపాటు ఎఐటియుసితో కలిసి పోటీలోకి దిగుతాయా లేదా విడివిడిగా గుర్తింపుసంఘం ఎన్నికలబరిలోకి దిగుతాయా అన్నది అర్థం కాని పరిస్థితి. ఈరెండూ యూనియన్‌ల నాయకులు కార్యకర్తలు డోలాయమాన పరిస్ధితులను ఎదుర్కొంటూ అధినేత సంజీరెడ్డి నిర్ణయంకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.