ఖమ్మం

పకడ్బందీగా స్థానిక ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఆగస్టు 27: వచ్చే నెల 8న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వార్డుమెంబర్లు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు వివిధ కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని కామేపల్లి మండలంలోని మద్దులపల్లి ఎంపిటిసి స్థానానికి, చింతకాని మండలంలో చింతకాని, కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి, రఘునాథపాలెం మండలంలోని చిమ్మపుడి, టేకులపల్లి మండలంలోని బచ్చుతండా గ్రామాల సర్పంచ్‌లకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అదేవిధంగా పలు మండలాల్లో వార్డుమెంబర్లకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికలకు మొత్తం 74ఈవిఎంలు అవసర పడతాయని, మరో 30 ఈవిఎంల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల 4వ తేదీన బ్యాలెట్ పేపర్‌ను, ఈవిఎంల ఏర్పాటుకు చర్యలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ అమర్చుటలో ఖమ్మం అర్బన్, కూసుమంచి, సత్తుపల్లి, కొత్తగూడెం తహశీల్దార్లను కూడా నియమించాలని డిఆర్వోను ఆదేశించారు. సర్పంచ్‌ల ఎన్నికలకు ఒక్కొక్క మండలానికి ఒకటి వార్డు మెంబర్లకు ఒక్కొక్కటి అదనంగా ఇవిఎంలు ఏర్పాటు చేయాలన్నారు. ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ మండల పరిషత్ భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. వార్డు మెంబర్లకు ఉదయం 7 గంటల నుంచి ఎన్నిక జరగ్గా, మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎన్నికల సిబ్బందికి తగిన విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎంపిటిసి ఎన్నికల పరిశీలనకు సింగరేణి తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌ను పంపాలన్నారు. సమావేశంలో జడ్పీ సిఈవో నగేష్, డిఆర్వో శ్రీనివాస్, ఇన్‌చార్జి డిపివో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్ వేగవంతం చేయాలి

ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 27: లేఅవుట్‌లేని స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద దరఖ్తాస్తులను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని సందర్శించి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం కమిషనర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో స్థలాల క్రమబద్ధీకరించుకునేందుకు 13469 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆ దరఖాస్తులను ప్రాంతాల వారీగా వేరుచేసి దరఖాస్తు దారులకు సమాచారం ఇచ్చి వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. క్రమబద్ధీకరణ గడువుఈ నెల 31వ తేదీతో ముగిసిపోతుందని కొందరు ఆందోళన చెందుతున్నారని, అటువంటి అపోహలను తొలగించాలన్నారు. అయితే త్వరతిగతిన ఎల్‌ఆర్‌ఎస్‌ను పూర్తి చేసేందుకు దరఖాస్తుదారులకు తగిన సమాచారం ఇచ్చి అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బొనగిరి శ్రీనివాస్, టౌన్‌ప్లానింగ్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
జలపాతంలో
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు
వెంకటాపురం, ఆగస్టు 27: వాజేడు మండలం చీకుపల్లి జలపాతంలో శనివారం సాయంత్రం సాయినిశ్రావణ్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మునిగి గల్లంతయ్యాడు. వరంగల్‌లోని హన్మకొండ పట్టణానికి చెందిన శ్రావణ్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. చెన్నైలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. స్నేహితుల వివాహం నిమిత్తం వరంగల్ జిల్లా కమలాపురం వచ్చారు. శనివారం కార్యక్రమానికి హాజరై జలపాతం చూసేందుకు కారులో స్నేహితులతో వెళ్లాడు. సరదాగా ఈత కొడుతుండగా శ్రావణ్ మాత్రం జలపాతం లోతుల్లోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. శ్రావణ్ ఎంతకీ ఒడ్డుకు రాకపోవడంతో ఆందోళన చెందిన మిగతా స్నేహితులు జలపాతం చుట్టూ కేకలు వేస్తూ వెతికే ప్రయత్నం చేశారు. శనివారం రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన విషయాన్ని వాజేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి గజ ఈతగాళ్ల ద్వారా జలపాతంలో గాలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెట్రోల్ బంక్ సీజ్

పినపాక, ఆగస్టు 27: మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఉన్న పెట్రోల్‌బంక్‌ను వినియోగదారుల ఫిర్యాదు మేరకు మండల తహశీల్దార్ కోటేశ్వరరావు, ఆర్‌ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పరిశీలించి బంక్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ బంక్‌లో అనేక రకాల కల్తీలు జరుగుతున్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో వినియోగదారులంతా ఎక్కువ శాతం గిరిజనులు కావడం వల్ల కల్తీ సాగుతున్నా గుర్తించలేకపోయారని అన్నారు. మండల సీఐటీయూ నాయకులు వాహనాల్లో పెట్రోల్ పోయించుకొని ప్రత్యక్షంగా కల్తీపై నిలదీయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై సీఐటీయూ నాయకులు ఫిర్యాదు చేయగా తహసిల్దార్, ఆర్‌ఐలు శాంపిల్స్ సేకరించారు. తహసిల్దార్ మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదు మేరకు బంక్‌లో శాంపిల్స్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడం జరిగిందని, రిపోర్టును బట్టి పూర్తిస్థాయిలో బంక్‌ను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.

కెసిఆర్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 27: రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి కెసిఆర్ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య ఆరోపించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మహారాష్టత్రో ముఖ్యమంత్రి కుదుర్చుకున్న ఒప్పందాల్లో తెలంగాణ కంటే మహారాష్టక్రే మేలు అధికంగా జరిగిందన్నారు. ఈ సంవత్సరం మార్చి నెలలో సిఎం కెసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పంద చేసుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ఏమిటో, ప్రస్తుతం జరిగిన ఒప్పందం ఏమిటో ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జాతీయ ప్రాజెక్టు ప్రాణాహిత చేవెళ్ళపై ఎవ్వరితో చర్చించకుండా దానిని రద్దు చేసిన ముఖ్యమంత్రి రీడిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై 6మీటర్లు కుదించి నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. భూసేకరణ పేరుతో 80 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. తన కుటుంబ ప్రయోజనాలు, స్వలాభం కోసం మహా ఒప్పందాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, వారిని చైతన్య పరుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశంలో కూరపాటి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి రామనాథం, స్వర్ణకుమారి, భవాని శంకర్, వల్లంకొండ వెంకట్రామయ్య, బిసిసెల్ అధ్యక్షుడు గొడ్డెటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
రామదాసు మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు
నేలకొండపల్లి, ఆగస్టు 27: కృష్ణాష్టమి పండుగను పరష్కరించుకుని నేలకొండపల్లి గ్రామంలోని భక్తరామదాసు మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లిలోని సంతాన వేణుగోపాల స్వామి కృపతో జన్మించిన భక్తరామదాసు మందిరంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో పంచామృతంతో అభిషేకాలు, ప్రత్యేక పూజలను అలయ అర్చకులు రజనీకాంత్ ఆచార్యలు నిర్వహించారు. శ్రీకృష్ణుని పారాయణం, శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. భక్తరామదాసు గీతాలు భక్తులు అలపించారు. ఈ కార్యక్రమంలో మతిమమత, రమాదేవి, గోపాలఉషా, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
భద్రాచలంలో పాలన అవినీతిమయం
భద్రాచలం, ఆగస్టు 27: భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీలో పరిపాలన కుంటు పడిందని, అవినీతి, అక్రమాలు, నిత్యం వివాదాలతో గ్రామ పంచాయతీ రోడ్డుకెక్కుతోందని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్య పాలనపై శనివారం ఆదివాసీ కొండరెడ్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ముర్ల రమేష్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. 30 ఏళ్ల తరువాత గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని భావించారని, కానీ సర్పంచి, ఈవో మధ్య అంతర్గత పోరువల్ల పరిపాలన కుంటుపడుతుందన్నారు. అనేక అభివృద్ధి పనులు టెండర్లు లేకుండానే ఏకపక్షంగా జరిగాయని, జరిగిన పనులు సైతం నాసిరకంగా ఉన్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. నిత్యం పాలకవర్గం, అధికారులు విబేధాలతో పరువు తీస్తున్నారని, దీనిపై పత్రికల్లో వచ్చినా ఎవరికీ చలనం లేదని అన్నారు. ఇంత రాద్దాంతం జరుగుతున్నా సమస్యను పరిష్కరించడంలో ఉన్నతాధికారులు సైతం విఫలమయ్యారన్నారు. పంచాయితీ ప్రక్షాళనకి అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, సెప్టెంబర్ 8న మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముర్ల రమేష్, బి.వెంకటరెడ్డి, అజీమ్, సుబ్బారావు, కడియం రామాచారి, వరప్రసాద్, వెంకటేశ్వర్లు, దాసరి శేఖర్, సుధాకర్, పౌల్‌రాజ్, సునీల్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కెసిఆర్‌ది
అప్రజాస్వామిక పాలన

కారేపల్లి, ఆగస్టు 27: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని కారేపల్లి క్రాస్‌రోడ్‌లో మండలాన్ని కొత్తగూడెంలో కలపాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. గిరిజన యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు రావాలంటే పరిశ్రమలు ఉన్న కొత్తగూడెం జిల్లాతోనే సాధ్యవౌతుందన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న మండలాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, ఇది గిరిజనులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయమేనని అన్నారు. సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురైయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వాంకుడోత్ గాంధీ, బాలాజీ, రమేష్, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

మతోన్మాద శక్తులకు
వ్యతిరేకంగా ఉద్యమించాలి

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 27: దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అసద్ అన్నారు. శనివారం దేశంలో జరుగుతున్న అహింస దాడులను నిరసిస్తూ జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పథకం ప్రకారం కొన్ని అరాచక శక్తులు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. దీనిని అంతా వ్యతిరేకించాలన్నారు. దీనిలో భాగంగానే గోవధ నిషేధం, ఘర్ వాపసీ వంటివి తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, రమణ, అహ్మద్, గౌస్, రాజు, బాబు, భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.