ఖమ్మం

ఉద్యోగుల జాబితా సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 1: జిల్లా పునర్విభజన సందర్భంగా ఆయా శాఖల ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించిన ఉద్యోగుల జాబితాను ఏప్పుడు అడిగినా ఇచ్చే విధంగా సిద్ధం చేసుకొని ఉంచాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక టిటిడిసిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజన సందర్భంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ సంబంధం లేకుండా పనిచేస్తున్న సిబ్బందిని మాత్రమే కేటాయింపు జరపాలని, కేటాయింపు చేసిన జాబితా రాష్ట్ర శాఖ బాధ్యుల జాబితా ఒకే విధంగా ఉండాలన్నారు. జిల్లా బాధ్యుల కేటాయింపు జరిగిన ఉద్యోగుల జాబితాతో పాటు నూతనంగా ఏర్పడే జిల్లిలో కార్యాలయం వసతి, చిరునామ, కార్యాలయంకు సంబంధించిన మ్యాప్, ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యాలయంలో గల ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫైళ్ళ వివరాలు, వ్యక్తిగత, రన్నింగ్ ఫైళ్ళ వివరాలు, వాహనాల కేటాయింపులు విడదీసి త్వరగా పర్యవేక్షక అధికారికి అందించాలన్నారు. సింగిల్ క్యాడర్ పోస్టులు 2 లేదా 3 ఉంటే ఒకటి నూతన జిల్లాకు కేటాయించాలన్నారు. నూతనంగా ఏర్పడే జిల్లాలో భవన కేటాయింపులకు నిధులు మంజూరు అయితే పర్వాలేదని, కాని పక్షంలో ప్రైవేటు భవనాల యజమానులతో అద్దెల అగ్రిమెంట్లు కూడా రాయించుకొని పంపించాలన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పంచాల్సి ఉంటుందన్నారు. కంబైండ్ ఫైళ్ళను పంచాల్సి వచ్చినప్పుడు జిరాక్స్‌లు తీయించి నూతన జిల్లాకు అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇవో నగేష్, డిఆర్‌డివో శ్రీనివాస్, డ్వామా పిడి జగత్‌కుమార్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.