ఖమ్మం

కెసిఆర్ పాలనకు చరమగీతం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పోడు సాగుదారుల జోలికి వస్తే పోరు తప్పదని, కెసిఅర్ అణచివేత పరిపాలనకు చరమగీతం తప్పదని పలువురు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. ఆదివారం పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన పోడు సదస్సులో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య, కూనంనేని సాంబశివరావులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కెసిఅర్ ప్రభుత్వం రాచరిక పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల ముందు కెసిఅర్ పేద ప్రజలకు, ఆదివాసి గిరిచనులకు ఇచ్చిన హామీలను విస్మరించడంతోపాటు హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కోవడం దారుణం అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తుంటే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిర్బంధాలు, కేసులు కమ్యూనిస్ట్ పార్టీలకు కొత్తేమీ కాదన్నారు,కెసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అంటే ఆదివాసి గిరిజనులను బజారుపాలు చేయడమేనా అని ధ్వజమెత్తారు. అలాంటి బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం 40వేలు దరఖాస్తులు చేసుకుంటే కనీసం 40 ఇళ్ల స్థలాలైన ప్రభుత్వం ఇచ్చిందా అని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పోరాటాల ద్వారా తెచ్చుకున్న చట్టాలను తుంగలో తొక్కుతూ చట్టవిరుద్దంగా పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని అడిగితే పోలీసులు,్ఫరెస్టు అధికారులు గిరిజనులను దూషించడం సరికాదన్నారు. అప్రజాస్వామిక నియంతృత్వ పాలనకు అద్దంపట్టేలా కెసిఆర్ పాలన కొనసాగుతుందన్నారు. పోడుభూములకు పట్టాలిచ్చేవరకు వామపక్ష పార్టీలు ఉధ్యమిస్తాయన్నారు. పోడు సదస్సుకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, పోటు రంగారావు, కాసాని ఐలయ్య, బాగం హేమంతరావు, గుమ్మడి నర్సయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, రావులపల్లి రాంప్రసాద్, అన్నవరపు కనకయ్య, మండే వీరహనుమంతురావు, గోకినపల్లి వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు తదితర్లు పాల్గొన్నారు.