ఖమ్మం

పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 11: పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు ఆ భూములను సాగుచేసే అధికారాన్ని గిరిజనులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక జిల్లాల ఏర్పాటు బిల్లును ప్రవేశపెడుతున్న ప్రభుత్వం గిరిజనులు ఎక్కువగా నివసించే ఖమ్మం జిల్లాలో వారందరికీ జీవించే అధికారాన్ని కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించడంలో భాగంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆదివాసిలు పోడు భూములను సేద్యం చేసుకుంటూ వారికి ఆ భూములు ఉండే విధంగా హక్కు కల్పించాలన్నారు. 2005లో చట్టం రూపొందించిన విధంగా అటవీ శాఖాధికారులు గిరిజనులకు ఇబ్బంది కలుగకుండా పోడు భూములను సేద్యం చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఎంతసేపు హైదరాబాద్ నగరానే్న అభివృద్ధి చేస్తుందని, ఆ విధంగా కాకుండా నగరీకరణలో భాగంగా అన్ని నగరాలను అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్‌లోని గ్రేటర్ మున్సిపాలిటీలోని పలు శివారు గ్రామాలు నేటికి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వం నగర శివారులోని కుగ్రామాలను సైతం అభివృద్ధి చేస్తేనే ఆ లక్ష్యం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్‌డి విద్యనభ్యసిస్తున్న మాగి వెంకన్న, నాగమణి దంపతుల ఆదర్శ వివాహానికి కోదండరామ్ హాజరై దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎస్ పాపారావు, గరిడేపల్లి సత్యనారాయణ, మార్టిన్, మురళీ, నాగేంద్రబాబు, చిర్రా రవి, శంకర్, విశ్వ, పివోడబ్ల్యూ సధ్య, స్వర్ణకుమారి, రంగరాజు, గోవర్థన్, బండి రమేష్, నున్నా నాగేశ్వరరావు, నిర్వల, ఎం శ్రీనివాస్, విప్లవ్‌కుమార్, పలువురు రాష్ట్ర, జిల్లా, మండల నేతలు పాల్గొన్నారు.