కర్నూల్

‘రోడ్ల విస్తరణ మహాయజ్ఞం’ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 21: రోడ్ల విస్తరణ పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాయజ్ఞం పేరిట నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరవడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడు నెలలుగా అనేక రకాలుగా రోడ్ల విస్తరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన మహాయజ్ఞం కార్యక్రమానికి కడప పెద్దదర్గా, కర్నూలు శివాలయం తదితర పవిత్ర స్థలాల నుంచి సేకరించిన నీరు, మట్టిని వేదిక వద్దకు తీసుకువచ్చి పట్టణ ప్రజల సంకల్పం రోడ్ల విస్తరణ యుద్ధ ప్రాతిపదికన చేయాలని నిరసన వ్యక్తం చేస్తుంటే పాలక మండలి, మున్సిపల్ యంత్రాంగం కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నారని నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతికోసం రెండు నిమిషాలు వౌనం పాటించారు. అలాగే పాఠశాలల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో వేదిక వద్ద ప్రజలను ఆకట్టుకున్నారు. రోడ్ల విస్తరణ చాలా కాలంగా రాజకీయ కారణాలతో వాయిదాలు పడుతుండడంతో ఇరుకు రోడ్లలో పట్టణ ప్రజలు రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటూ వారి కుటుంబ సభ్యులు అనాధలవుతున్నా పాలక మండలి పట్టించుకోవడం లేదని, పురపాలక యంత్రాంగం మొద్దునిద్రలో ఉందని రోడ్ల విస్తరణ పోరాట సమితి కన్వీనర్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, న్యాయవాది శంకరయ్య అన్నారు. ఇప్పటికైనా పాలక మండలి కళ్లు తెరువాలని, రోడ్లు విస్తరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారికోసం విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణానికి చుట్టు పక్కల ఉన్న పట్టణప్రాంతాలన్నీ రోడ్లు విస్తరించుకొని సుందరీకరణ చేసుకొని అక్కడి ప్రజలు ప్రశాంతంగా గడుపుతున్నా నంద్యాల పాలకులు కళ్లు తెరువడం లేదన్నారు. నంద్యాల పురపాలకులకు కనువిప్పు కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణానికి సేకరించిన మన మట్టి, మన నీరు లాగానే తాము కూడా వివిధ ప్రాంతాల్లోని పవిత్ర స్థలాల నుండి నీరు, మట్టిని మున్సిపల్ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద మట్టిలో మమేకం చేశారన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో రోడ్ల విస్తరణల వల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ జన నాట్యమండలి కళాకారులు పాటలు పాడి అలరించారు. పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఈకార్యక్రమానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి చాబోలు సర్పంచు చిన్న బాల హుసేనితో పాటు వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ప్రైవేటు విద్యాసంస్థల కన్వీనర్ రాహేలమ్మ, కార్యదర్శి దస్తగిరి, అధ్యక్షులు వెంకటరాముడు, కళారాధన అధ్యక్షులు రవికృష్ణ, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ముర్తుజా, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు కెఎ ఖాన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
.