కర్నూల్

కేబుల్ రంగంలో తీవ్రమైన పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 19:కేబుల్ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆ రంగంలో పోటీదారుల మధ్య వ్యాపార సమరం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. కేంద్రం విధించిన గడువుకు మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో వినియోగదారులను ఆకర్శించడానికి పోటీదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కర్నూలులో సీమ కమ్యునికేషన్స్ ఆధ్వర్యంలో వినియోగదారులకు సెట్ టాప్ బాక్సులు పంపిణీ చేయడానికి సిద్ధపడటంతో అనుమతులు లేవంటూ పోలీసులు ఆ సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీని ప్రభావం జిల్లాలోని అన్ని పట్టణాల్లో కొత్తగా రంగంలోకి దిగనున్న కేబుల్ నిర్వాహకులపై పడింది. దాంతో వారు తమ వ్యాపార వేగాన్ని తగ్గించుకున్నారు. అయితే పోలీసు చర్యలకు వ్యతిరేకంగా సీమ కమ్యునికేషన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించగా పోలీసు చర్యపై స్టే విధిస్తూ వ్యాపారాన్ని అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశించిందని ఆ సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి శనివారం తెలిపారు. కోర్టు ఆదేశాలతో ఇక తాము కర్నూలు నగరంలో ఇంటింటికీ తిరిగి వినియోగదారులకు సెట్ టాప్ బాక్సులను విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. వీరికి పోటీగా ప్రస్తుతం కర్నూలులో ప్రసారాలను అందజేస్తున్న మహాలక్ష్మి కమ్యునికేషన్స్ వారు సైతం తమ వ్యాపార విస్తృతికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉన్న తమ వినియోగదారులకు సెట్ టాప్ బాక్సులను అందజేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీమ కమ్యునికేషన్స్ సంస్థకు కోర్టులో అనుకూల నిర్ణయం రావడంతో జిల్లాలోని అన్ని పురపాలక పట్టణాల్లో కేబుల్ వ్యాపారంలో పోటీ వాతావరణం వేడెక్కుతోంది. డిజిటలైజేషన్ ప్రక్రియకు సమయం సమీపిస్తుండటంతో కేబుల్ రంగంలో పోటీదారులు తమ వ్యాపార విస్తృతికి ప్రణాళికలు రచించుకుంటూ నాణ్యమైన సెట్ టాప్ బాక్సులను వీలైనంత తక్కువ ధరకు అందజేయడంతో పాటు కొత్తగా రంగంలోకి దిగుతున్న వారు ప్రస్తుతం లాభాపేక్ష లేకుండా నెలసరి చందా నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలులో నెలసరి చందా రూ. 180 వరకూ ఉండగా సీమ కమ్యునికేషన్ సంస్థ తక్కువ ధరను నిర్ణయించి వినియోగదారులను ఆకర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఇంత కాలం కేబుల్ రంగం ఒకరిద్దరి చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడ్డారని సిపిఎం నేత ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక పోటీ వాతావరణం కారణంగా నాణ్యమైన కేబుల్ ప్రసారాలు తక్కువ ధరకే ప్రజలకు అందుతాయంటున్నారు.
ఇంటర్నెట్ రంగంపైనా ప్రభావం..
కేబుల్ వ్యవస్థ డిజిటలైజేషన్ కారణంగా ఏర్పడిన పోటీ ఇంటర్నెట్ రంగంపై కూడా ప్రభావం చూపుతోంది. కేబుల్ ప్రసారాలను అందించే సెట్ టాప్ బాక్సు ద్వారా ఇంటర్నెట్‌ను కూడా అందించే సౌలభ్యం ఉండటంతో ఆయా సంస్థల వారు వినియోగదారుల కోరికపై ఇంటర్నెట్‌ను కూడా అందించడానికి వీలవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాపారంలో ఉన్న పలు సంస్థలు తమ వినియోగదారులు మరో సంస్థ వైపు వెళ్లకుండా ఉండేందుకు ధర తగ్గించి ప్రచారం ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల, ఆదోనితో పాటు ఇతర పురపాలక పట్టణాల్లో కూడా ఇంటర్నెట్ ధరలు తగ్గితే ప్రజల్లో వినియోగం పెరుగుతుందని వారు భావిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలు
విజయవంతం చేయండి
* జెసి హరికిరణ్
కర్నూలు అర్బన్, డిసెంబర్ 19:నగరంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ జరిగే రాష్ట్ర స్థాయి రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ రూరల్ క్రీడల ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జెసి ఛాంబర్‌లో శనివారం జెసి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వాహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి బాలబాలికలు హాజరవుతారన్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన, వసతి ఏర్పాట్లు చేయాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సత్యంను ఆదేశించారు. అలాగే క్రీడా పోటీలు సేందుకు వచ్చే ప్రజల కోసం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో షామియానా, కుర్చీలు, విజిటర్స్ గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. క్రీడల నిర్వహణ సమయంలో నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. క్రీడాకారులు బస చేసే మాంటిస్సోరీ, ఉర్దూ స్కూల్, ప్రభుత్వ టౌన్ మోడల్ స్కూళ్ల వద్ద స్నానపు గదులు, మరుగుదొడ్లు వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వసతి గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎపిఎస్‌పి డీఎస్పీ షరీఫ్‌ను ఆదేశించారు. వసతి ప్రాంతాల్లో ఏవైనా లోటు పాట్లు వుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ డిఇఓ తహెరా సుల్తానాను ఆదేశించారు. క్రీడాకారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్‌బి డీఎస్పీ కృష్ణమూర్తి, డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్లు బాలకొండయ్య, దివాకర్ పాల్గొన్నారు.