కర్నూల్

నంద్యాలలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 27: నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి, సోమవారం రోజంతా భారీ వర్షం కురిసింది. ఈ ఏడాదిలో ఇదే మొదటి భారీ వర్షంగా నమోదు కావడంతోపాటు ప్రజలు కూడా భారీ వర్షం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో నంద్యాల పట్టణ ప్రజలకు దాహార్తి సమస్య తీరడమేకాక నంద్యాల డివిజన్ పరిధిలో భారీ వర్షాలు కురియడంతో వ్యవసాయం ఊపందుకుంది. రైతులందరు సంతోషంగా వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి సంజీవనగర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధాన రోడ్డుపై భారీ ఎత్తున వర్షపునీరు పారింది. ఒకవైపు సిమెంటు రోడ్డు వేస్తున్నా, మరో వైపు నుంచి మొకాలిలోతు నీరు ప్రధాన రహదారిపై పారడంతో మున్సిపల్ కార్యాలయంలోకి రాకపోకలకు కొంత సేపు అంతరాయం కలిగింది.
ఆళ్లగడ్డలో..
ఆళ్లగడ్డ : పట్టణంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని వైపిపిఎం జూనియర్ కళాశాల మైదానంలో నీళ్లు నిలబడ్డాయి. వక్కిలేరుకు నీళ్లు రావడంతో రైతులు అనందం వ్యక్తం చేశారు.
లారీ, బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం..
* ఏడుగురికి తీవ్రగాయాలు
గడివేముల, జూన్ 27:గడివేముల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొరతమద్ది గ్రామం వద్ద సోమవారం బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యావని ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వివరాలు.. నంద్యాల నుంచి గడివేములకు వస్తున్న ఆర్టీసీ బస్సు, గడివేముల నుంచి వెళ్తున్న లారీ కొరతమద్ది మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మితి మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వారిలో మండల పరిధిలోని చిల్కూరు గ్రామానికి చెందిన సువర్ణ(40), పొరపోలూరుకు చెందిన మాసుంబి (60) చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.