కర్నూల్

సోనియా, రాహుల్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, డిసెంబర్ 19:ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం డోన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. తొలుత పట్టణంలోని పాతబస్టాండ్‌లో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి లక్కసాగరం లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సోనియా, రాహుల్‌పై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బిజెపికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాస్తారోకోలో నాయకులు నాగభూషణంరెడ్డి, ఓబుళాపురం శేషిరెడ్డి, భాస్కరనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సిఎం కెఇ ఇళ్ల ముట్టడి
కర్నూలు, డిసెంబర్ 19:బుడగ, బేడ జంగం రిజర్వేషన్ హక్కుల సాధన కోసం బుడగజంగాలు ఈ నెల 14వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం ఉదయం 7వ నెంబర్ జాతీయ రహదారిపై తుంగభద్ర వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం నగరంలోని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఇళ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా సంఘం నాయకులు తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ బుడగ, బేడ జంగాల షెడ్యూల్డ్ రిజర్వేషన్ హక్కులు ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను కొనసాగించాలన్నారు. అలాగే 144 జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిచో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బుడగజంగాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.