కర్నూల్

రూ. 120 కోట్లతో క్యాన్సర్ యూనిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 11 : కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో 10 ఎకరాల స్థలంలో రాష్ట్రంలోనే అతి పెద్ద క్యాన్సర్ యూనిట్ ఏర్పాటుకు రూ. 120 కోట్లు మంజూరు చేయించానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి కామినేని సోమవారం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు నగర నడిబొడ్డున దాదాపు 120 ఎకరాల్లో వున్న ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. తాను మెడికల్ కాలేజీలో చదివినప్పటి నుంచి ఆసుపత్రిని చూస్తున్నానని, ఈ వైద్యశాల కర్ణాటక ప్రాంతం, చుట్టు పక్కల జిల్లాలతో పాటు కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు దేవాలయం లాంటిదన్నారు. ఆసుపత్రిలో భవనాలు వర్టికల్‌గా లేకుండా ఎక్కడంటే అక్కడ ఉన్నాయని ఆసుపత్రిని క్షుణ్ణంగా పర్యవేక్షించి మాస్టర్ ప్లాన్ తయారు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఆసుపత్రిలోని భవనాలను 4 రకాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నామన్నారు. ఆసుపత్రిలో చుట్టూ పచ్చని చెట్లు వున్నాయని ఆవరణలో పచ్చగడ్డితో గార్డెన్ అభివృద్ధి చేసి రోగులకు ఆహ్లాద వాతావరణం కల్పించేలా చర్య లు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుక, నగర ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కలెక్టర్ విజయమోహన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు
సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో రూ. 40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ భూమిపూజ చేశారు. అందులో భాగంగా తొలుత సూపర్‌స్పెషాలిటీ విభాగంలో రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన రీజినల్ కార్డియో థోరాసిక్ సర్జరీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను అత్యాధునిక పరికరాలు రూపొందించారన్నారు. అలాగే మాతా శిశు సంరక్షణ విభాగంలో యుజి, పిజి, ప్యామిటీ క్వార్టర్స్, సీనియర్ రెసిడెన్సీ క్వార్టర్స్, ఉభయ డయాగ్నాసైన్ సెంటర్‌తో పాటు దాదాపు రూ. 40 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయమోహన్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేత్రదానం చేసి అంధులకు
చూపునివ్వండి
* ఎస్పీ ఆకె రవికృష్ణ
పాణ్యం, జూలై 11:సమాజంలో అంధత్వం రూపుమాపడానికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా నేత్రదానం చేయాలని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. సోమవారం ఆర్‌జిఎం ఇంజనీరింగ్ కళాశాలలో చైర్మన్ మిద్దె శాంతిరాముడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆర్‌జిఎం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ భూతాన్ని రూపుమాపాలన్నారు. నాగార్జున యూనివర్శిటీలో రుషికేశ్వరి ర్యాగింగ్ భూతానికి బలైన సంగతి గుర్తు చేశారు. కాగా 20 సంవత్సరాలుగా ఆర్‌జిఎంలో ర్యాగిం గ్ లేని కళాశాలల్లో రాయలసీమలో పేరు పొందడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆర్‌జిఎం విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న చైర్మన్, అధ్యాపకులను అభినందించారు. అనంతరం నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో పోలీసు శాఖలోని కుటుంబాలు మరణాంతరం నేత్రదానం చేయడానికి అంగీకరించారన్నారు. అలాగే పోలీసు శాఖ ద్వారా లక్ష మందికి పైగా ప్రజలను నేత్రదానంలో భాగస్తులుగా చేర్చగలిగామన్నారు. శ్రీలంకలో అందరు నేత్రదానానికి సహకరించి ప్రపంచంలో పేరుగాంచారన్నారు. చైర్మన్ శాంతిరాముడు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో 12 వేల మంది విద్యార్థులు, 3,600 మంది అధ్యాపకులు, సిబ్బంది పనిచేస్తున్నారని, వీరిలో ఇప్పటికే పది వేల మంది నేత్రదానానికి అంగీకరించి పత్రాలు అందించారని, మరో 25 వేల మందిని ఇందులో భాగస్వాములను చేరుస్తామన్నారు. గూడూరుకు చెందిన జ్ఞాననేత్ర స్వచ్చంద సంస్థ ఆర్గనైజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంథుల పాట కచేరి ఆహుతులను అలరించింది. ఈకార్యక్రమంలో డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జయచంద్ర ప్రసాద్, డాక్టర్ ఎంవి సుబ్రమణ్యం, డాక్టర్ శేఖర్, కళాశాల డీన్ డాక్టర్ అశోక్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు, డాక్టర్ ఉమేష్ చంద్ర, సి పార్థసారథిరెడ్డి, ఎస్‌ఐ మురళీమోహన్‌రావు, నంద్యాల, గడివేముల, నందివర్గం పోలీసు స్టేషన్లకు చెందిన సిఐలు, ఎస్‌ఐలు సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పల్లె ఆసుపత్రిలో వైద్యసేవలపై
కమిషనర్ ఆగ్రహం
* సూపరింటెండెంట్, డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు
* ముగ్గురు నర్సులపై వేటు..
* శానిటరీ కాంట్రాక్టర్ తొలగింపునకు ఆదేశం
బనగానపల్లె, జూలై 11:పట్టణంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో వైద్యసేవలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ బికె నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కమిషనర్ నాయక్, ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి సాయంకాలం 4 గంటల సమయంలో తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడి వైద్యులు, నర్సులు జ్వర పీడితులకు ధర్మామీటర్ ఉపయోగించకుండా తూతూ మంత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని స్వయంగా చూసిన కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఎందుకు వచ్చారో వారి అనారోగ్య సమస్యలు విని పరీక్షలు చేయకుండా ఇష్టారాజ్యం గా విధులు నిర్వర్తించడంపై మండిపడ్డారు. జ్వర పీడితులకు ధర్మామీటర్‌తో ఎందుకు పరీక్ష చేయలేదు.. వాంతు లు, విరేచనాలతో వస్తున్న రోగులకు పరీక్షలు నిర్వహించేది ఇలాగేనా.. అని నిలదీశారు. కమిషనర్ చెప్పినా సిబ్బం ది ముందుకు కదలకపోవడంతో ఆగ్రహించిన ఆయన నర్సులు సౌదామిని, చెన్నమ్మ, ఎస్తేరురాణిలను అక్కడికక్క డే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సూపరింటెండెంట్ సుజాతమ్మ ఆసుపత్రికి నిధులు వస్తున్నా అవసరమైన వాటికి ఖర్చు చేయకపోవడం, రోగుల పట్ల డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, మందులు బయటకు రాసివ్వడం తదితర కారణాలతో కమిషనర్ సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇక డాక్టర్ రాజేశ్ సెలవు చీటీ లేకుండా గైర్హాజరు కావడంతో ఆయనకు షోకాజ్ నోటీసు జా రీ చేయడంతో పాటు ఆయన తొలగింపునకు ఆదేశించారు. డాక్టర్ వెంకటేశ్వ ర్లు నిర్లక్ష్యాన్ని గుర్తించిన కమిషనర్ ఆయనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశా రు. పనితీరు మార్చుకోవాలని సేవాభావంతో వైద్య సేవలు అందించాలని, మరోసారి ఇలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంత రం కమిషనర్, ఎమ్మెల్యే బాత్‌రూము లు, టాయిలెట్స్ చూసి అవాక్కయ్యా రు. అక్కడ నీరు లేకపోవడం, దుర్గం ధం వెదజల్లడంతో శానిటరీ కాంట్రాక్టును రద్దు చేసి వెంటనే కాంట్రాక్టర్‌ను తొలగించి ఇతరులను తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పలువురు రోగులు వైద్యశాలలో సౌకర్యాలు లేవని, ఫ్యాన్లు తిరగవని, మందులు బయటకు రాసిస్తున్నారని, దోమబెడద ఎక్కువగా వుందని, రాత్రి వేళల్లో డాక్టర్ వుండరని, సిబ్బంది పట్టించుకోరని కమిషనర్‌తో మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన కమిషనర్ 15 రోజుల తర్వాత మళ్లీ వస్తామని పరిస్థితిలో మార్పురాకుంటే కఠినచర్యలు తప్పవని అందరినీ హెచ్చరించారు. ఎమ్మెల్యే బిసి మాట్లాడుతూ తాము రెండేళ్ల నుంచి వైద్యశాలను పరిశీలించి పద్ధతులు మార్చుకోవాలని ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి సూ చించామని అయినా పట్టించుకోకుం డా ప్రవర్తించడంతో సోమవారం కర్నూలులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి ఫిర్యా దు చేసినట్లు తెలిపారు. దీంతో స్పం దించిన మంత్రి ఆసుపత్రిని తనిఖీ చేయాలని కమిషనర్‌ను పంపారని స్పష్టం చేశారు. డాక్టర్లు, సిబ్బంది ఇకనైనా పనితీరు మార్చుకుని వైద్యసేవలు సక్రమంగా అందించాలని లేకుంటే వారిపై దండన తప్పదన్నారు. కొందరు డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీసు, నర్సింగ్ హోంలు పెట్టుకుని ఇక్కడి రోగులను అక్కడికి రప్పించుకుని వైద్యం అందించడంపై ఎమ్మెల్యే కమిషనర్‌కు ఫిర్యా దు చేశారు. అలాగే ఆసుపత్రిలో గతం లో జరిగిన అవకతవకలను పలువురు కమిషనర్‌కు వివరించడంతో ఆయన ఆశ్చర్యపోయా రు. డాక్టర్లు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వుండటాన్ని తాము ఎక్కడా చూడలేదన్నారు. వారితో పాటు రాష్ట్ర వైద్య శాఖ సంయుక్త కమిషనర్, ఇతర అధికారుల బృందం, ఉమామహేశ్వరరెడ్డి వున్నారు.
ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి
మంత్రి కామినేని ఆమోదం
* ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి
బనగానపల్లె, జూలై 11:నియోజకవర్గం పరిధిలోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అంగీకరించినట్లు ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే బిసి కర్నూలులో మంత్రి కామినేనిని కలిసి వినతి పత్రం ఇవ్వగా ఆయన స్పందించి అవసరమైన సిబ్బందిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు కూడా వినతి పత్రం ఇచ్చినట్లు ఎమ్మెల్యే బిసి తెలిపారు.